Off The Record: దానం నాగేందర్ కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా ఉందా?
- బీఆర్ఎస్ నుంచి గెలిచి జై కాంగ్రెస్ అంటూ దూకేసిన దానం..
- మంత్రి పదవి మీద ఆశతో నాడు పార్టీ మార్పు?..
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ, ఓటమి..
- మంత్రి పదవి లేక, ఎంపీ అవక నిస్పృహ..
- ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా ఊడిపోయే ప్రమాదం..
- కాంగ్రెస్ బీ ఫామ్ మీద పోటీచేసి అడ్డంగా బుక్ అయిన దానం..
- స్పీకర్‌ను టైం అడిగిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే..
- నారు పోసిన వాడే నీరు పోస్తాడంటూ వేదాంతం..
- నాచేత అన్ని పనులు చేయించింది సీఎం రేవంతేనంటున్న దానం..
- ఆయనే ఏదో ఒకటి చేయకుండా ఉంటారా అని వ్యాఖ్యలు..
- దానంది వెటకారమా? సీఎం మీద అటాకింగ్ మోడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: నారు పోసిన వాడే నీరు పోయాలి. వద్దు వద్దంటున్నా… ఆయనే యుద్ధం చేయించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు… ఇప్పుడు మాత్రం వదిలేస్తారా ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారా ఎమ్మెల్యే. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యల్లో వెటకారం ఉందా? లేక కాన్ఫిడెన్స్ ఉందా అన్నది అర్ధంగాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట చాలామంది. ఎవరా ఎమ్మెల్యే? సీటు కిందికి నీళ్ళొచ్చినా… తడి గుడ్డేసుకుని కూర్చోవడం వెనక రీజన్స్ ఏంటి?
Read Also: NCRB Report: దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఇదే.. తాజా నివేదిక..
Also Read
- OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
- OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
- OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
- OTR: తన బయోపిక్ పక్కన పెట్టి సోనియా గాంధీపై సినిమా? జగ్గారెడ్డి ప్లాన్ ఏంటి?
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు. కానీ… కారులో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమోగానీ… ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా…జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్. ఇంకేముంది… పార్టీ అధికారంలో ఉంది, నాకు సీనియార్టీ ఉంది.. కాబట్టి అలా చేరీ చేరగానే పిలిచి మరీ కేబినెట్లో ఛైర్ వేసేస్తారని కలలుగన్నారాయన. కానీ, తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్టయింది ఆయన పరిస్థితి. దానం ఆలోచన అలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి మరొకటి తలచారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో దూకిన ఎమ్మెల్యేని లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయించారు. బ్యాడ్‌లక్.. కాలం కలిసిరాకుంటే.. తాడే పామై కరిచినట్టు.. ఢిల్లీ బరిలో ఓటమి తప్పలేదు దానంకు. మంత్రి పదవి మీద మోజుతో తెలంగాణ భవన్ మీది నుంచి డైరెక్ట్‌గా గాంధీభవన్ మీదికి దూకేసినా.. ఆ లక్ష్యం నెరవేరలేదు, పోన్లే ఎంపీ అయిపోయి జాతీయ రాజకీయాల్లో ఉందామనుకున్నా అదీ.. అవలేదు. ఏదీ దక్కక తీవ్ర నిస్పృహలో ఉన్న నాగేందర్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది.
Read Also: AP Govt: తప్పుడు ప్రచారం కట్టడిపై ఏపీ సర్కార్ నిఘా.. మంత్రుల కమిటీ ఏర్పాటు
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లు మంత్రి దక్కలేదు, ఎంపీ అవలేదుగానీ.. ఉన్న ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్‌లో చేరి హస్తం పార్టీ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేశారు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారాయన. పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా సుప్రీం మెట్లెక్కింది బీఆర్ఎస్. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ వారంతా టెక్నికల్ రీజన్స్ చూపించి ఏదో విధంగా ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకున్నా.. దానం నాగేందర్ పదవిపై మాత్రం కత్తివేలాడుతోందన్న మెజార్టీ అభిప్రాయం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయడమన్నది ఇక్కడ తిరుగులేని సాక్ష్యంగా కనిపిస్తోంది. నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సుప్రీం కోర్ట్‌కు వెళ్లింది బీఆర్ఎస్.
Read Also: Tribal Students Death: అనారోగ్యంతో గిరిజన విద్యార్థినులు మృతి.. భయాందోళనలో తల్లితండ్రులు
నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ చెప్పడంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను, వాళ్లపై ఫిర్యాదు చేసిన వారిని పిలిచి స్పీకర్ విచారణ మొదలుపెట్టారు. దానం మాత్రం కొంత సమయం అడిగారు. పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న మిగతా వాళ్ళు సాంకేతిక కారణాలు చూపి బయటపడ్డా దానం మాత్రం తప్పించుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం మౌన ముని పాత్ర పోషిస్తున్నారు. ఏంటి సార్ మీరు చాలా కూల్‌గా ఉన్నారంటే.. నాకేం భయం.. నారు పోసినవాడే నీరు పోస్తాడు. పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది సీఎం… ఆ తర్వాత వద్దు మొర్రో అంటున్నా వినకుండా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి ఎంపీగా పోటీచేయించింది కూడా ఆయనే. భారీగా ఖర్చుపెట్టించింది కూడా ముఖ్యమంత్రే. ఇన్ని చేసిన సీఎం ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి చేయకుండా ఉంటారా? ఆయనే చేయాలి, చేస్తారు కూడా అంటూ ఒకలాంటి అటాకింగ్ మోడ్‌లో మాట్లాడుతున్నారట ఖైరతాబాద్ ఎమ్మెల్యే.ఈ ఎటాక్ వెనుక బాగా.. ఎటకారం కూడా దాగి ఉందన్నది విశ్లేషకుల మాట. మరి దానంను సీఎం ఆగం చేస్తారా? అక్కున చేర్చుకుంటారా అన్నది చూడాలి.
తాజావార్తలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్‌పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
-
India-Pakistan: ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి భారత్‌కు పాకిస్తాన్ మంత్రి!
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!