జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రజలు భారత రాష్ట్ర సమితికి (బీఆర్ఎస్) గట్టి బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లుగా ఆ పార్టీ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఏ మాత్రం ముందుకు సాగలేదని, ఇప్పుడు ప్రజలే ఆ విఫలతకు తీర్పు ఇవ్వబోతున్నారని అన్నారు.
అంతేకాకుండా.. “జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ పార్టీ గూబ గుయ్యిమనేట్లు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఉప ఎన్నికతో ఆ పార్టీ చిరునామా గల్లంతవుతుంది. పదేళ్ల పాలనలో అభివృద్ధి పేరుతో ఒక్క రోడ్డు సరిచేయలేని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఓట్ల కోసం నటన చేస్తున్నారు,” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇప్పటికే ఆ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారని గుర్తుచేశారు. “అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను ఓడగొట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పారు. అయినా ఇంకా నేర్చుకోలేదు,” అని పొన్నం వ్యాఖ్యానించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకూ ప్రజలు సరైన పాఠం చెప్పబోతున్నారని ఆయన స్పష్టం చేశారు. “జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుకు బాధ్యత బీఆర్ఎస్, బీజేపీలదే. మాగంటి సునీత కంటతడి పెట్టిస్తూ గులాబీ పార్టీ ఓట్లు దండుకోవాలని చూస్తోంది. కానీ ఈసారి ఓటర్లు మోసపోవడం లేదు,” అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
Yashasvi Jaiswal: నెక్స్ట్ ‘షేన్ వార్న్’ యశస్వి జైస్వాలే.. వీడియో వైరల్!