Harish Rao : ఆరు గ్యారంటీలు సహా అన్నిట్లో కాంగ్రెస్ ఫెయిల్
- జూబ్లీహిల్స్‌లో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు
- కాంగ్రెస్ హామీలను విస్మరించిందని విమర్శ
- ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ను నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్
- డబ్బులు, మద్యానికి అమ్ముడుపోకుండా బీఆర్ఎస్కు ఓటు వేయాలని పిలుపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా “బాకీ కార్డులు” పంచి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బకాయిల ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు.
మీడియాతో మాట్లాడిన హరీష్ రావు.. “ఆరు గ్యారంటీలు సహా అన్నింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని విస్మరించింది. ఈ పరిస్థితి మారాలంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. అప్పుడే కాంగ్రెస్‌కు బుద్ధి వస్తుంది,” అని వ్యాఖ్యానించారు. ముస్లింల సంక్షేమం పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని హరీష్ రావు ఆరోపించారు. “ముస్లింలకు ఇస్తామన్న ప్రత్యేక బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. ముస్లిం వ్యక్తిని ఉపముఖ్యమంత్రిగా చేసిన ఘనత మాత్రం కేసీఆర్‌దే,” అని ఆయన గుర్తుచేశారు.
Also Read
- BM Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఇన్ఛార్జీ బీఎం సందీప్ కుమార్ కీలక పిలుపు..
- HYDRAA: నగరంలో మరో చెరువు పునరుద్ధరణకు హైడ్రా ప్లాన్.. 3 ఎకరాల నుంచి 12 ఎకరాలకు విస్తరణ
- Koti Deepotsavam 2026 Day 9: కోటి దీప యజ్ఞంలో నేడు మరో విశేష ఘట్టం.. కంచి కామాక్షి మహాభిషేకం, మీనాక్షి కల్యాణం!
- Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి పై కూడా హరీష్ రావు తీవ్రంగా దాడి చేశారు. “కొడంగల్ నియోజకవర్గంలో మస్జిద్లు, దర్గాలను కూల్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. అన్ని వర్గాల అభివృద్ధి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సాధ్యమైంది,” అని చెప్పారు. చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, “డబ్బులు, మద్యానికి అమ్ముడుపోవద్దు. కాంగ్రెస్ పెట్టే ప్రలోభాలను ఎడమచేత్తో నెట్టేసి బీఆర్ఎస్కు ఓటు వేయండి. ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ చేసిన పనులను గుర్తుంచుకోండి,” అని హరీష్ రావు పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
-
MG Windsor EV Facelift 2027: 449KM రేంజ్.. MG Windsor EVలో భారీ 61kWh బ్యాటరీ! ఎప్పుడు లాంచ్ కానుందంటే?
-
Suraj Barjatya: వయెలెన్స్ మధ్య పాత ఫ్యామిలీ ఫార్ములా.. సూరజ్ బర్జాత్యా హిట్ కొట్టేనా?
-
Road Accident: జబర్దస్త్ నటులకు రోడ్డు ప్రమాదం.. దొరబాబు, రైజింగ్ రాజులకు గాయాలు..!
ట్రెండింగ్
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!
-
Nikhil Chaudhary: భారత్‌లో పుట్టి.. ఆస్ట్రేలియా తరఫున ఆడుతూ..! ఢిల్లీ కుర్రాడి దెబ్బకు ఇంగ్లండ్ విలవిల..
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!