కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్ పార్టీ ఫిరాయింపుల పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాడు బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే నేడు కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే హస్తం గూటికి చేరారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
CM Revanth: ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పని చేస్తా..
Kaushik Reddy: పార్టీ మారిన వాళ్ళకి సిగ్గు శరం లజ్జ లేదు అని హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేయనివ్వటం లేదు అని విమర్శలు గుప్పించారు.
సింగరేణిని ప్రైవేటీకరించేందుకే కేంద్రం తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసింది అని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కు అయి భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ బీఫాంపై గెలిచిన ఎమ్మెల్యేలు పోచారం, శ్రీనివాస రెడ్డి, సంజయ్‌కుమార్‌లు కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావాల్సి ఉందన్నారు.