గురుకుల ఉపాధ్యాయ పోస్టుల అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీష్ రావు మద్దతు తెలిపారు. అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తరపున డిమాండ్ చేశారు. “ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం అని చెప్పుకుంటున్నప్పటికీ, గురుకుల ఉపాధ్యాయ పోస్టుల కోసం పోటీ పడుతున్న వారి పోరాటాల పట్ల ఉదాసీనంగా ఉండటం నిరుత్సాహకరం” అని ఆయన అన్నారు. అభ్యర్థులు పలుమార్లు మంత్రులు, అధికారులకు విన్నవించినా, ముఖ్యమంత్రి నివాసం…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మేల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీఫాం పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. వారి సభ్యత్వం రద్దు కావాల్సి ఉందని.. వారిపై పిటిషన్ ఇవ్వాలని స్పీకర్ ను సమయం కోరామని జగదీష్ రెడ్డి తెలిపారు. ఈరోజు లేదా రేపు సమయమిస్తానని స్పీకర్ చెప్పారన్నారు. గతంలో పార్టీ మారిన ముగ్గురు…
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈరోజు ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కూతలు... ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కోతలు అని విమర్శించారు. మరోవైపు.. రైతుబంధు ఎప్పుడు ఇస్తారని జనం తమను అడుగుతున్నారని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ అంతా చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని.. 2018 కంటే ముందు మిగిలిన వ్యవసాయ రుణమాఫీ ఏం చేస్తరని కాంగ్రెస్ ప్రభుత్వంను అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య రాజకీయం ఒక్కసారిగా హిటెక్కింది. చెల్పూర్ హనుమాన్ ఆలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. గతం లో ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి ప్రణవ్ ఎమ్మేల్యే కౌశిక్ రెడ్డి పై ఆరోపణలు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే అవినీతికి పాల్పడినట్లు, రైస్ మిల్లర్లు, ఇసుక మాఫియా వద్ద డబ్బులు వసూలు చేశాడని, పూర్తి ఆధారాలతో చెల్పూరు…
KTR on BRS MLA’s Defections: 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లను గెల్చుకున్న బీఆర్ఎస్.. కంటోన్మెంట్ బై ఎలక్షన్లో ఓడిపోయి ఆ సంఖ్య 38కి తగ్గిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికలకు ముందు కేకే, దానం నాగేందర్, కడియం శ్రీహరిలు గులాబీకి బైబై చెప్పి.. హస్తం గూటికి చేశారు. తాజాగా సీనియర్ లీడర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే ఎం.సంజయ్…
Palla Rajeshwar Reddy: జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు. పార్టీ మారాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తనపై ఒత్తిడి తెస్తుందని సంచలన ఆరోపణ చేశారు.
బొగ్గు గనుల వేలంపై తమ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని సమర్థిస్తూముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డిచేసిన ఆరోపణలనుతెలంగాణ ప్రజలు కాంగ్రెస్, రెండు జాతీయ పార్టీలకు గుణపాఠం చెబుతారనిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావుహరీష్ BJP, అన్ని రంగాలలో వారికి ద్రోహం చేసినందుకు తగిన గుణపాఠం. తెలంగాణ ఆస్తులు, హక్కులు, వనరులను తాకట్టు పెట్టే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు నేరాల్లో భాగస్వాములుగా ఉన్నాయన్నారు. సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ కోసం బిజెపికి అందించిన “సహకారం” కోసం కాంగ్రెస్ పార్టీపై “X” తీసుకెళ్ళి,…
వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షల సాయం ప్రకటించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు డిమాండ్ చేశారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రవేశపెట్టిన దళిత బందు కంటే గొప్ప పథకాన్ని ప్రకటించాలి. దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వారిని సంపన్నులుగా మార్చేందుకు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా…