MLC Challa Venkatamireddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.
రాష్ట్రంలో గాడి తప్పుతున్న ప్రభుత్వ విద్యావ్యవస్థ, పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహింగలేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేయడానికి అనేక చర్యలు తీసుకున్నారని హరీష్ రావు అన్నారు. పాఠశాల విద్య మొదలుకొని ఉన్నతవిద్య వరకు సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాత్రం, ప్రభుత్వ విద్యావ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదన్నారు. అరకొర…
మహిళ ప్రజాప్రతినిధులందరికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉన్నాయని మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. నా చిన్నప్పటి నుండి నేను మంత్రులు ఎమ్మెల్యేల క్వాటర్స్ లో ఉండి పెరిగాను, ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగాయని, టీఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ గా మార్చడం పట్ల నా తప్పు కూడా ఉంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ అంశం లేవనెత్తే అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీకి పవర్ లేదు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీ…
పార్టీ ఫిరాయింపులనై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ల స్ఫూర్తిని కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని, అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించాడన్నారు. తెలంగాణ వస్తే చాలు- మరే పదవి వద్దన్నాడని, జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను విస్తరించి.. ప్రధాని కావలని కలలు కన్నాడన్నారు. సార్.. కారు.. పదహారు అన్నావు… పార్లమెంటు…
GHMC Council Meeting: ఈరోజు ఉదయం 10 గంటలకు బల్దియా కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే గందరగోళంగా మారింది.
BRS MLCs In Congress: బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్స్ తగులుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్లో చేరగా.. రాజ్యసభ సభ్యుడు కే. కేశవ్ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న మరుసటి రోజే ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు.
మల్కాజ్గిరి మరోసారి రాజకీయ కక్షలతో రణరంగంగా మారింది. మల్కాజ్గిరి నియోజకవర్గం మౌలాలి ఆర్టీసీ కాలనీలో రోడ్డు పనులను సందర్శించడానికి వెళ్లిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పై మౌలాలి కాంగ్రెస్ నాయకులు దాడికి యత్నించారు. గత కొంతకాలంగా మౌలాలి డివిజన్ లోని ఆర్టీసీ కాలనీ రోడ్లు మరమ్మతులకు నోచుకోలేదు, తద్వారా స్థానిక ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలన అంతా.. నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్టు నడిచిందని లక్ష్మణ్ ఆరోపించారు. కాంగ్రెస్ మీద తిరుగుబాటు వస్తుందని కేసీఆర్ అంటున్నారు.. ఆరు నెలల కింద కూడా మూడోసారి తమదే రాజ్యం అన్నారు.. చివరకు ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్కు క్లియర్ తీర్పు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారన్నారు. ఇదిలా ఉంటే.. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్,…
రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం అని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మొన్న ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలగా.. తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో నిన్న సీఎం సొంత జిల్లాలోనే…