KTR: మా పార్టీలో ఉండి కడియం అప్పట్లో కామెంట్ చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు అర్ధం అవుతుంది కడియం కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.
Adi Srinivas: హరీష్ రావును బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కంచుకోటలో కార్ పార్టీకి కేరాఫ్ మాయమైపోతోందా? చివరికి మేయర్ సీటు కూడా కారుజారిపోయే ముప్పు ముంచుకు వస్తోందా? మేయర్ కదలికలు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయా? ఇంతకీ ఏ మేయర్ సీటు గులాబీ దళానికి దూరమయ్యే ముప్పు ముంచుకు వస్తోంది? ఏ పార్టీ వైపు చూస్తున్నారా మేయర్? అంత జరుగుతున్నా…. బీఆర్ఎస్ నేతలు చేష్టలుడిగి చూస్తున్నారు ఎందుకు? కార్ పార్టీకి కంచుకోట కరీంనగర్. అనేక సంక్షోభ సమయాల్లో గులాబీ దళానికి అండగా ఉన్న జిల్లా ఇది. అసెంబ్లీ…
మాజీ మంత్రి హరీష్ రావును కేంద్ర మంత్రి బండి సంజయ్ పొగడతలతో ముంచెత్తారు. ఉద్యమం చేసి ప్రజల్లో అభిమానం ఉన్న నేత అని అన్నారు. హరీష్ రావు మంచి నాయకుడు.. హరీష్ రావు ప్రజల మనిషి అని తెలిపారు. కేటీఆర్, కేసీఆర్ మాత్రం ప్రజల విశ్వాసం కోల్పోయిన నేతలు అంటూ, హరీష్ రావు మంచి నాయకుడు పొగిడారు. ఢిల్లీలో బీఆర్ఎస్ నేతలు, బీజేపీ నేతలతో చర్చలు జరిపారా అంటూ మీడియా ప్రశ్నించగా.. ఆయన స్పందించారు.
బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హైదరాబాద్కు ఏం చేసింది అంటున్నారు.. 'ఔటర్ తెచ్చింది మేము.. ఐటీ తెచ్చింది మేము.. ఎయిర్ పోర్ట్ కట్టింది మేము' అని రేవంత్ రెడ్డి తెలిపారు. మీరేం చేశారు.. గంజాయి, డ్రగ్స్ తెచ్చారని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తాము ఏదో ఒకటి చేసుకుంటూ పోతుంటే.. కాళ్ళల్ల కట్టే పెట్టే పనిలో వాళ్ళు ఉన్నారని మండిపడ్డారు. వీళ్ళ పని ఐపోయింది అన్నోడు ఎక్కడ ఉన్నాడు.. కనపడకుండా…
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు…
రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.