Uttam Kumar Reddy: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రిగా కాస్త ఆలస్యంగా వచ్చానని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు. కాళేశ్వరం విషయంలో అన్నీ తప్పుడు లెక్కలే… 93 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టుల్లో కూడా అవినీతే అంటూ మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్ట్ లపై తెచ్చిన అప్పులకు 20 వేల కోట్లు వడ్డీలు కట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అత్యంత ఘోరమైన తప్పిదమన్నారు. కేంద్ర జలవనరుల సలహాదారు కూడా కాళేశ్వరం తీవ్ర తప్పిదం అని పిసి ఘోష్ కమిషన్ ముందు ఆధారాలతో చెప్పారన్నారు. మెడిగడ్డ కాకుండా తుమ్మిడి హట్టి సరైన చోటు అని శ్రీరామ్ వెదిరే అఫిడవిట్ ఇచ్చారని తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్లకు నిజాలు నిగ్గు తేల్చాలని అప్పగించామన్నారు. బ్యారేజీ భవిష్యత్ తేల్చాలని కోరామని తెలిపారు.
Read also: Shamshabad: యువకుడ్ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. చివరకు..
వారు కొన్ని మధ్యంతర సూచనలు ఇచ్చారు.. వారి సూచనలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని బ్యారేజీల్లో కొన్ని పనులు చేసామన్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆదారిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రి గా కాస్త ఆలస్యంగా వచ్చానని.. ఇకపై ప్రతీ నెలా జిల్లా అభివృద్ధి పై సమీక్షలు ఉంటాయన్నారు. కాళేశ్వరంలో పంప్ హౌస్ ల పరిస్థితి పై నివేదిక కోరామని తెలిపారు. ఎల్లంపల్లి పైన ఉన్న పంప్ హౌస్ లు కాలువలు అన్నీ వాడతామన్నారు. రేపు ndsa మీటింగ్ లో అన్నీ మాట్లాడతామని తెలిపారు. ఆయకట్టు స్థిరీకరణ విషయంలో అన్నీ అబద్ధాలే చెప్పారని తెలిపారు. కాళేశ్వరంలో పంప్ చేసిన నీటి కంటే వదిలేసిన నీరే ఎక్కువ అన్నారు. ఐదేళ్లలో కాళేశ్వరం లో 65 టీఎంసీల నీరు మాత్రమే వాడారని అన్నారు. కాళేశ్వరం అన్ని పంపులు నడిస్తే ఏటా రూ.10వేల కోట్ల విద్యుత్ ఖర్చు అవుతుందన్నారు. ప్రజలపై ఇంత భారం మోపారు కాబట్టే ప్రజలు బీఆర్ఎస్ ని ఇంటికి పంపారు.. ఆ పార్టీ క్లోజ్ అయ్యే స్థితికి వచ్చిందన్నారు. తెలంగాణ రైతాంగ విషయంలో ఒక విప్లవాత్మక చర్య తీసుకున్నామని తెలిపారు.
Read also: Microsoft Outage : మైక్రోసాఫ్ట్ కారణంగా ప్రపంచంలో గందరగోళం.. స్టాక్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మేలు కోరుతూ తీసుకున్న నిర్ణయం పట్ల గర్వపడుతున్నామన్నారు. కార్పొరేట్ రంగానికి ఇచ్చిన రుణమాఫీ రైతులకు ఎందుకు ఇవ్వరు అని రాహుల్ గాంధీ పోరాడుతున్నారని అన్నారు. 12 లక్షల కోట్లు కార్పొరేట్ల కు మోడీ సర్కారు సబ్సిడీ పేరుతో మాఫీ చేసిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ పదేళ్లలో 25 వేల కోట్లు రుణమాఫీ చేస్తే… మా ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే 31 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డు అంశంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసే ప్రయత్నం చేసాయన్నారు. జగిత్యాలలో 39262 మందికి 207 కోట్లు, కరీంనగర్ 37745 మందికి 194 కోట్లు, పెద్దపల్లిలో29725ఆడికి 149 కోట్లు సిరిసిల్లలో 23986 మందికి136 కోట్ల రూపాయలు రుణమాఫీ ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు త్వరలో మా సర్కార్ ఇవ్వబోతోందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు వేర్వేరుగా ఇస్తున్నామన్నారు. బీఆర్ఎస్ అంటే మోసం దగా.. కేటీఆర్ కి చెప్తున్న మీరు పదేళ్లలో 25 వేళా కోట్లు రుణమాఫీ చేస్తే 8 నెలల్లో 31 వేల కోట్లు చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగా మిగలబోతోందన్నారు. త్వరలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో చేరబోతున్నారని తెలిపారు.
Banjara Hills: విద్యుత్ బకాయి చెల్లించమంటే పిడిగుద్దులు కొట్టారు భయ్యా..