అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఇలా ఇప్పటివరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, మరి కొందరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొందరు కూడా పార్టీ మారుతారని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్కు బైబై చెప్పి బీజేపీలో చేరబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ మార్పు…
రాష్ట్రంలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హస్తం గూటికి చేరుకున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రానున్న రోజుల్లో తెలంగాణలో సామాన్య కార్యకర్త సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. బీజేపీ అంటే ఉత్తర భారతదేశం పార్టీ అని కొంత మంది కామెంట్ చేశారని.. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రాబల్యం ఉందని వారికి అర్థమైందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంతో తెలంగాణలో ఏమి మారలేదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన హామీల అమలులో వైఫల్యంపై పోరాటం చేయాలని రాజకీయ తీర్మానం చేశామన్నారు. రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటి వరకు లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దందాల కోసం, కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజా పాలనకోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. ప్రజల పేగు బంధాన్ని తెంచిందే కేసీఆర్ అని విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఏ మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తాడని దుయ్యబట్టారు.