Raghunandan Rao: వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బడ్జెట్‌పై కొందరు అర్థ సత్యాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు సమపాళ్లలో కేటాయింపులు జరిగాయన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏ నేతృత్వంలో అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నా, రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా ఆలోచన విధానం ఒకటే అన్నారు. జెండాలు మాత్రమే మారాయి తప్ప విధానాలు మారలేదన్నారు. మార్పు ఏదైనా ఉందా అంటే.. దానం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారని తెలిపారు. మార్పు ఇంకేదైనా ఉందంటే.. కుర్చీలు మాత్రం మారాయన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రూ. 20 కోట్లతో కేసీఆర్ కొన్నారని, కానీ తాము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రూ. 5 కోట్లకే కొన్నామని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్ చాట్‌లో చెప్పారని తెలిపారు.
Read also: Champions Trophy 2025: పాక్ కు టీమిండియా వెళ్లకపోవడమే కరెక్ట్..హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రతి మహిళకు రూ. 2,500 ఇస్తామన్నారు. ఏడాదికి రూ. 30 వేలు అవుతుంది. ఇచ్చారా? బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి? అని ప్రశ్నించారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఏవి మరి? అని అన్నారు. మంచి చేస్తే తాము చేశామని, చెడు జరిగితే బీజేపీ చేసిందని అంటున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రూ. 35,500 కోట్లు రుణం తెచ్చామన్నారు. రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం రూ. 9 లక్షల పైనే ఉందన్నారు. వికారాబాద్ జిల్లాల్లో తలసరి ఆదాయం రూ. 1 లక్ష పైన ఉందన్నారు. చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంత వ్యత్యాసం ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా చూసినా సరే ఇదే తరహా అంతరాలు ఉంటాయన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ. 26 వేల కోట్లుగా చూపించారని తెలిపారు. గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కింద రూ. 21 వేల కోట్ల పైన చూపించారని తెలిపారు. ఈ రెండు కలిపితే దాదాపు రూ. 50 వేల కోట్లు తెలంగాణకు వస్తున్నాయని తెలిపారు. మరి తెలంగాణకు ఏమిచ్చారు అని ఎలా ప్రశ్నిస్తున్నారని అన్నారు.
Read also: Kamala Harris vs Donald Trump: చర్చకు రెడీ అంటునన్న కమలాహారిస్.. ఇప్పుడే వద్దన్న ట్రంప్
నిధులు వచ్చుడో, ఇద్దరం చచ్చుడో అన్నారు కదా అని తెలిపారు. ఢిల్లీ జంతర్ మంతర్ రండి. నిధులు వచ్చాయని తేలితే ముక్కు నేలకు రాయండి అని అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన నిధులను ఇందిరమ్మ ఇళ్లుగా పేరు మార్చి కడుతున్నారా లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని ఇళ్లు మంజూరు చేసిందో లెక్కలున్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద రూ. 10 లక్షలకు కేంద్రం పెంచిందన్నారు. దీన్నే ఆరోగ్యశ్రీ కింద మీ పేరు మీద ప్రచారం చేసుకుంటున్నారని తెలిపారు. మైనారిటీల పండుగల కోసం రూ. 33 కోట్లు కేటాయించారని అన్నారు. మరి తెలంగాణలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా?.. సెక్యులరిజం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నారు.. మూసీ ప్రాజెక్టుపై డీపీఆర్ ఇచ్చావా? డీపీఆర్ లేకుండా నిధులెలా వస్తాయి? అన్నారు.
Read also: Katrina Kaif: వాట్ ఏ ఫిల్మ్.. విజయ్ సినిమాపై కత్రినా కైఫ్ పొగడ్తలు!
మూసీ ప్రాజెక్టును ఏటీఎం చేసుకోవాలని అనుకుంటున్నావా? ఫసల్ బీమా యోజనలో చేరతామని భట్టి చెప్పారు. ఈ పథకం కేంద్ర ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. కౌలు రైతులకు కూడా నిధులిస్తామన్నారు. ఒక్క రూపాయి ఇచ్చారా? అని ప్రశ్నించారు. మహిళలకు మీరు ఇస్తామన్నది ఏమైంది. ఏడాదికి కనీసం రూ. 30 వేల కోట్లు కేటాయించాలి. మరి బడ్జెట్‌లో ఎక్కడా కనిపించదే? తెలంగాణ బడ్జెట్‌లో ఒక్క జిల్లా పేరైనా వచ్చిందా రేవంత్ రెడ్డి? అన్నారు. వికారాబాద్ జిల్లాకు ప్రత్యేక గ్రాంట్ ఏమైనా ఇచ్చారా?కేసీఆర్ సీఎంగా ఉంటే గజ్వేల్ కి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవగానే కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఏర్పడింది. వికారాబాద్ వుడా కాలేదు. రంగారెడ్డి రుడా కాలేదన్నారు. కొడంగల్ కి డిగ్రీ కాలేజి, నర్సింగ్ కాలేజీలు తీసుకెళ్లావన్నారు.
మరి రాష్ట్రంలో 118 నియోజకవర్గాలు మీకు కనిపించలేదా? మా దుబ్బాకు ఒక మెడికల్ కాలేజి ఇచ్చావా? ఆదిలాబాద్ కో, బోధ్‌కో మెడికల్ కాలేజీ ఇచ్చావా? కొడంగల్‌కు రూ. 5 వేలు కోట్లు ఇచ్చుకున్న నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. అభయహస్తం అన్నారు.
Read also: Army Jawan: నల్లగొండలో తీవ్ర విషాదం.. అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి..
అది భస్మాసుర హస్తమైందన్నారు. బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తా అన్నాడు. ఒక్కటైనా ఇచ్చారా? అని ప్రశ్నించారు. అధికారంకోసం అడ్డమైన హామీలిచ్చి, అడ్డదారులు తొక్కి అడ్డమైన గడ్డి తిని, ఇప్పుడు చేస్తున్నదేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకో పరీక్ష అన్నారు. పరీక్షలు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. ఆపన్న హస్తం కర్కశ హస్తంగా, కపట హస్తంగా మారిందన్నారు. హరీశ్ రావు బడ్జెట్‌కి, భట్టి బడ్జెట్‌కి తేడా ఏముంది? అని ప్రశ్నించారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి అంటున్నారు. అక్కడ చదువుకున్నవారికి పేదలకు టాయిలెట్లు కట్టించాలన్న ధ్యాస లేకపోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తోలు గుడ్డు పెట్టిన కేటీఆర్, గాడిద గుడ్డు అంటున్నారన్నారు. గుండు సున్నాలు పెట్టినోళ్లు, గాడిద గుడ్లు పెట్టినోళ్లు ఈరోజు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 33 జిల్లాల పేర్లను బడ్జెట్‌లో చదవని మీరు, కొడంగల్‌కు కుడా పెట్టినట్టు మిగతా పట్టణాలకు పెట్టని మీరు మాట్లాడే హక్కు లేదన్నారు. మీరంతా నై తెలంగాణ బ్యాచ్. మేమంతా జై తెలంగాణ బ్యాచ్ అన్నారు. ఒక్క వేలు మావైపు చూపిస్తే.. నాలుగు వేళ్లు మీ వైపు చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి నరేంద్ర మోడీ కట్టుబడి ఉన్నారని తెలిపారు.
Gold Rate Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?