MLC Jeevan Reddy: ఇప్పటికైనా మీ విహార యాత్రను ఆపాలని బీఆర్‌ఎస్ నాయకులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకులు కాళేస్వరం ప్రాజెక్ట్ కు పోతుంటే అచ్చర్యం కలుగుతుందన్నారు. మూడు లిఫ్ట్ లో తరలిస్తే ముప్పై వేల కోట్ల ఖర్చు అయ్యే ప్రాజెక్టు కు లక్షా ఇరవై కోట్లు చేసిండన్నారు. అప్పులకు కేసీఆరే బాద్యుడు అని మండిపడ్డారు. నిర్మానాత్మకంగా లోపాలు ఉన్నాయని తెలిపారు. మూడు ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయొద్దని NDSA స్పష్టంగా చెపితే.. విజిలెన్స్ కూడా నివేదిక ఇవ్వబోతున్నదన్నారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోవాలని సూచించారు. వాస్తవాలు తెలిసి కప్పి పుచ్చుకోవడానికి విహార యాత్ర లాగా పోయిండ్రు అంటూ వ్యంగాస్త్రం వేశారు. ఒక వైపు న్యాయ విచారణ కొనసాగుతుంది.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
Read also: Raghunandan Rao: హరీష్ రావు బడ్జెట్‌కి, భట్టి బడ్జెట్‌కి తేడా ఏముంది?
కేసీఆర్ అనుభవం ప్రజలకు ఉపయోగ పడుతదని అనుకున్నామన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని అన్నారు. ఎల్లంపల్లి నుండి నీటిని తరలించ డానికి ఒకే ఒక అవకాశం ఉందని..వేరే మార్గం లేదన్నారు. గత బీఆర్ఎస్ వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. తుమ్ముడి హట్టి వద్ద 148 మీటర్ల నిర్మాణానికి మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకొన్నారని తెలిపారు. 148 మీటర్ల ఎత్తు తో నీటి ని తరలిస్తే ప్రాణహిత నీళ్లు ఒక్క లిఫ్ట్ తో ఎల్లంపల్లి కి న్నీళ్లు వచ్చేటివన్నారు. కేసీఆర్ కమీషన్ల కోసం లక్షల కోట్ల అప్పులు చేసిండన్నారు. ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తుండని తెలిపారు. ముసలి కన్నీరు కార్చడం మానుకొని.. మీరు చేసిన తప్పులకు ప్రజలను క్షమాపణ కోరండి అన్నారు. ఇప్పటికైనా మీ విహార యాత్ర ను ఆపాలన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. మరో 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు..