BRS Leaders Team: నేడు కరీంనగర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. గోదావరిఖనిలో బస..
- నేడు కరీంనగర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం..
- గోదావరిఖనిలో బస చేయనున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Leaders Team: నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కరీంనగర్ కు వెళ్లనుంది. మధ్యాన్నం హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ బృందం బయలుదేరనుంది. సాయంత్రం లోయర్ మానేరు రిజర్వాయర్ సందర్శించనున్నారు. కరీంనగర్ లో డిన్నర్ తర్వాత గోదావరిఖని ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. గోదావరిఖనిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. గోదావరిఖని ఎన్టీపీసీ, సింగరేణి గెస్ట్ హౌస్ లలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు బస చేయనున్నారు. రేపు మేడి గడ్డను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మొదటగా కన్నెపల్లి పంప్ హౌస్ ని విజిట్ చేసి మీడియాతో మాట్లాడి మెడిగడ్డ బ్యారేజ్ పరిశీలనకు పయనం కానున్నారు. కాళేశ్వరం పర్యటన అనంతరం వీరంతా తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మేడిగడ్డ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మేడిగడ్డ వరదల నుంచి బయటపడిందంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక బీఆర్‌ఎస్ నేతలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
Read also: Hyderabad Crime: తల్లి బలవన్మరణం.. షాక్ గురైన కొడుకు కూడా..
Also Read
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
మరోవైపు కాళేశ్వరంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ప్రాజెక్టు పగుళ్లు, ఇసుకలో కూరుకుపోయిందన్న ప్రచారాలను మానుకోవాలన్నారు. ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నా కాళేశ్వరం పంప్‌హౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే కేసీఆర్ ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించబోతున్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ ఇటీవల మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించి కోట్లాది క్యూసెక్కుల నీరు వచ్చి మేడిగడ్డ నిలుస్తోందన్నారు. తాజాగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో టీమ్ పర్యటనకు వెళ్లడంతో రాజకీయంగా ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ సాయంత్రం ఎల్‌ఎండీ రిజర్వాయర్‌కు బీఆర్‌ఎస్ నేతలు చేరుకోనున్నారు. ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం బీఆర్‌ఎస్ బృందం రాత్రి రామగుండంలో బస చేయనుంది. రేపు 10 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్, 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం హైదరాబాద్‌కు తిరిగి రానుంది.
Joe Biden: వయస్సు, అనారోగ్యం కాదు.. తన అభ్యర్థిత్వాన్ని ఎందుకు వదులుకున్నాడో చెప్పిన బైడెన్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?