Sabita Indra Reddy: ముఖ్యమంత్రిపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర విమర్శలు..
- ఎక్స్ వేదికగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు
- విద్యార్థుల ముందు.. గురువుల ముందు కేసీఆర్ ను విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి- సబితా
- గడిచిన పది నెలలలో కేసీఆర్ పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?- సబితా ఇంద్రారెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.’ విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్ గారిని విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారు @TelanganaCMO. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా..?. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమా లేక పార్టీ కార్యక్రమా అని ముఖ్యమంత్రి గారు మర్చిపోతున్నారు. మీరు ఇచ్చాం అని చెప్తున్న టీచర్ పోస్టులు కేసీఆర్ గారు మంజూరు చేసినవి కావా, హైయర్ ఎడ్యుకేషన్‌లో 3202 పోస్టులు, యూనివర్సిటీలో 1081 పోస్టులు కేసీఆర్ గారి ప్రభుత్వం మంజూరు చేసినవి కావా?.. ఇంటర్, టెక్నికల్ మరియు కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి 3896 కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్ గారు రెగ్యులర్ చేశారు అని చెప్తే బాగుండేది. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అని ఆ గురువుల ముందు చెప్తే బాగుండేది.’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.
Read Also: Pat Cummins: ఆ ఇద్దరు టీమిండియా ప్లేయర్స్ సక్సెస్‌కు కారణం పాట్ కమిన్స్!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- Producers Council : మళ్లీ రానున్న 'నంది' జాతర.... సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
‘ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూతపడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేది. “మన ఊరు మన బడి” కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్తే బాగుండేది.
6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నది అని చెప్తే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో “బ్రేక్ ఫాస్ట్ స్కీమ్” ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది. ఎన్నికల సమయంలో చెప్పినట్టు ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్య భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేది. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న మీరు మిగితా పాఠశాలలను గాలికి వదిలేశాము అని చెప్తే బాగుండేది’ అని సబితా ఇంద్రారెడ్డి ఎక్స్‌లో తెలిపారు.
Read Also: Vizag Honey Trap Case: కిలాడీ లేడీ జాయ్ జేమిమ హనీట్రాప్ కేసులో కొత్త కోణాలు..
తాజావార్తలు
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!