Kotha Prabhakar Reddy : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి తన దూకుడు వ్యాఖ్యలతో హాట్ టాపిక్ అయ్యారు. NTVకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన ఆయన, పార్టీ నేతలపై ఘాటుగా విరుచుకుపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చమని మా నాయకుడు కేసీఆర్ ఎప్పుడూ చెప్పలేదు. అలాగే మేము కూడా ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో లేము. ప్రజలు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు. కొన్ని రోజుల్లో మళ్లీ అధికారంలోకి మేమే వస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.
“ప్రజలు, బిల్డర్లు, వ్యాపారవేత్తలు స్వచ్ఛందంగా మా పార్టీకి విరాళాలు ఇస్తున్నారు. వారు తిరిగి BRS పార్టీ అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. కేసీఆర్ గారే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు” అని కొత్త ప్రభాకర్ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించడాన్ని తప్పుపడిన కొత్త ప్రభాకర్ రెడ్డి, “మీకు మీ పార్టీపై నిజంగా నమ్మకం ఉంటే మా 10 మంది ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకున్నారు? నేను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాను. అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ మంత్రులు కూడా అదే ధైర్యం చూపించగలరా?” అంటూ సవాల్ విసిరారు. అంతేకాక, తనను అడ్డుకున్నా, తనపై కేసులు పెట్టినా తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకులుగా ప్రజల అభిప్రాయాన్ని వినిపించడం తాము చేసే పని మాత్రమేనన్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ తో గోపీచంద్ మలినేని సినిమా..?