పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ తప్పక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 3 నెలలు లేకుంటే.. 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయన్నారు. దమ్ముంటే పార్టీ మారిన నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి ఎన్నికలకు రండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుందన్నారు. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే ఎన్నికలు అవుతాయని విమర్శించారు. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుంది అని కేటీఆర్ తెలిపారు.
‘ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిన మాటలు హైదరాబాద్ నగర ప్రజలు నమ్మలేదు. అందుకే హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఈ ప్రభుత్వంకు పరిపాలన చేయడం చేతకాక కేసీఆర్‌ను తిడుతున్నారు. కేసీఆర్ అప్పుల పాలు చేశారు అని నిందలు వేస్తున్నారు. అప్పుల పాలు అంటున్న కాంగ్రెస్‌ను పార్లమెంట్ కూడా మొట్టికాయలు వేసింది. దిక్కు మాలిన పాలన వల్ల హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బ తిన్నది. హైడ్రా కాంగ్రెస్ వాళ్లకు బ్లాక్ మెయిల్ దందా కోసం పనిచేస్తుంది. ఒకరోజు కేసీఆర్‌ను జైల్లో పెడతా, ఇంకోరోజు కేటీఆర్‌ను జైల్లో పెడతా అంటూ 20 నెలలుగా టైం పాస్ చేశారు’ అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Also Read: Medipally Murder Update: మేడిపల్లి హత్య కేసులో సంచలన విషయాలు.. పక్కా ప్రణాలికతోనే..!
‘తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో బై ఎలక్షన్ వస్తుంది. దమ్ముంటే ఈ పది నియోజకవర్గాల్లో రాజీనామా చేసి రండి. ఎన్నికలకు వెళితే కేసీఆర్ ఏంటో, రేవంత్ రెడ్డి ఏంటో తెలుస్తుంది. ఉప ఎన్నికలు తప్పకుండా వస్తాయి. 3 నెలలు లేకుంటే 6 నెలల సమయంలో ఎన్నికలు వస్తాయి. బై ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్‌కు బై బై చెప్పే ఎన్నికలు అవుతాయి. ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటుంది’ అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు.