Uttam Kumar Reddy : తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంపై గత పదేళ్లలో జరిగిన విధ్వంసాన్ని ఎండగడుతూ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలనే కనీస చిత్తశుద్ధి లేదని ఆయన ధ్వజమెత్తారు. కృష్ణా జలాల్లో తమ వాటాగా ఉన్న 299 టీఎంసీల నీటిలో పాలమూరు-నల్గొండ జిల్లాల ప్రాజెక్టుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏనాడూ గట్టిగా డిమాండ్…
Uttam Kumar Reddy : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జరిగిన మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం నుండి కృష్ణా జలాల పంపకాల వరకు బీఆర్ఎస్ నేతలు అనుసరించిన విధానాలు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందని,…
Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల…
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్…
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ జారీ అయింది. శుక్రవారం అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ఈ వారెంట్‌ను విడుదల చేసింది. పాస్‌పోర్ట్ రద్దు కావడంతో ప్రభాకర్ రావు ట్రాన్సిట్ వారెంట్ కోసం దరఖాస్తు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇది జారీ అయ్యింది. ఈ పరిణామాలతో ప్రభాకర్ రావు శనివారం భారత్‌కు బయలుదేరి, జూన్ 8 అర్థరాత్రి హైదరాబాద్ చేరుకోనున్నారు. వెంటనే…
Uttam Kumar Reddy : హుజూర్నగర్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవకతవకలు జరిగాయని ఆయన బహిరంగంగా ఆరోపించారు. నిజాలు బయటపడేందుకు ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులో మూడు బ్యారేజీల ఫౌండేషన్‌లోనే లోపాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “బెరాజీలు కూలిపోయే…
Duddilla Sridhar Babu : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎదుర్కొన్న కేసును హైదరాబాద్ నాంపల్లి కోర్టులో కొట్టేసింది. ఈ కేసు 2017లో కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణ సమయంలో ఆయనపై నమోదు అయింది. కోర్టు తాజా తీర్పుతో న్యాయం జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, “2017లో BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రైతుల భూములు బలవంతంగా లాక్కొంటుందని నిరసనగా పబ్లిక్ హియరింగ్‌కు వెళ్లాం. అప్పట్లో మేము 12మందిపై అక్రమంగా నాన్-బెయిలబుల్…
Ponguleti Srinivas Reddy : కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పాలకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఈ దోచుకున్న డబ్బులతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నట్లు బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని, ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ను రెండు సార్లు తిరస్కరించారని స్పష్టం చేశారు. అయినా వాళ్లకు బుద్ధి రావట్లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర విభజన జరిగినప్పుడు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. "బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి రైతులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దడం జరిగింది. సమయానికి రైతుబంధు తో పాటు సబ్సిడీలు అందజేసి నూనె గింజల పంటలను సాగు చేసేలా ప్రోత్సాహం కల్పించాం. సాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నాం. నాటి ప్రణాళికా బద్దంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నూనె పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు(సన్ ఫ్లవర్)…