Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని B1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మిక, మైనింగ్, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు, అరెస్టులతో కేసీఆర్ రాచరిక పాలన సాగించారని వివేక్ ఆరోపించారు. తెలంగాణను 60 వేల కోట్ల అప్పుల నుంచి 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా మార్చారని, దీనికి వడ్డీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏటా 5 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని అన్నారు.
Road Accident: ORRపై కారు బీభత్సం.. పలువురికి గాయాలు!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని వివేక్ తెలిపారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే కేటాయించారని, ఇప్పుడు అర్హులైన పేదలకు ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని వెల్లడించారు. అలాగే 9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
Sand Mafia: ఇసుక మాఫియా దందాకు ఏడుగురు బలి..! రోడ్డున పడిన మూడు కుటుంబాలు..
ఇక కొత్త గనుల విషయంలో ముఖ్యమంత్రి మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి వివేక్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా చేసి, తద్వారా ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైందని విమర్శించారు. అలాగే మిషన్ భగీరథ పథకం ఒక అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అని వివేక్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం 42 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఇంటికి కూడా తాగునీరు అందించలేదని ఆరోపించారు. పథకాల పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్లు దోచుకుందని ఆయన వ్యాఖ్యానించారు. మందమర్రి ప్రజలకు అమృత్ స్కీమ్‌తో శాశ్వత మంచి నీటి సౌకర్యం లభిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసమే పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించిందని ఆయన ఆరోపించారు.