KCR: ప్రముఖ కవి, 'జయ జయ హే తెలంగాణ' ఉద్యమ గీత రచయిత, డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం పట్ల విచారం తెలుపుతూ తన సంతాపం ప్రకటించారు.
నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ప్రారంభం కానున్నది. ఈరోజు ఉదయం 11:30 గంటలకు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరుకానున్నారు. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఈటెలను క్రాస్ ఎగ్జామింగ్ చేయనున్నారు. గతంలో ఈటెల నిర్వర్తించిన బాధ్యతల ఆధారంగా ప్రశ్నావళి సిద్దం చేసింది కమిషన్. మొదటి గంట కమిషన్ ముందు వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఇవ్వనున్నారు జస్టిస్ చంద్ర ఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన ఆర్థికపరమైన ప్రశ్నలు కమిషన్…
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
కాళేశ్వరం కమిషన్ ముందుకు మాజీ సీఎం కేసీఆర్ జూన్ 5న విచారణకు హాజరుకానున్నారు. కేసీఆర్ కమిషన్ హాజరు సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా నుంచి రేపు కేటీఆర్ హైదరాబాద్‌కు రానున్నారు. జూన్ 5న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు ప్రభాకర్ రావు హాజరుకానున్నారు. ఇదే రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదకపై నిర్మాణ సంస్థపై చర్యకు ఆమోదం తెలుపనుంది కేబినెట్. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.…
కేసీఆర్ మాట్లాడుతూ.. త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందని నేతలకు తెలిపారు. జిల్లాలో పార్టీ ఓడిపోయినా నేతలు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. కాంగ్రెస్ పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన సూచించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ వారంలోనే ఆయన హస్తిన టూర్ ఉంటుందని చెబుతున్నారు పార్టీ శ్రేణులు. కాగా.. ఎన్నికల తర్వాత మొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఆయన మూడు నెలల సమయం తర్వాత ఢిల్లీకి వెళ్తున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత కేసీఆర్ అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. తుంటి నొప్పితో బాధపడిన కేసీఆర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని నడవగలుగుతున్నారు. అంతేకాకుండా.. మొన్న నల్గొండలో జరిగిన బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు.
నేటి నుంచి కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడంపై ప్రజలలో ఆసక్తి నెలకొంది.
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. కానీ, బడ్జెట్ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నట్లు తెలిపారు.
నేడు స్పీకర్ ప్రసాద్ కుమార్ సమక్షంలో మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేసీఆర్ ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీలోని ఎల్ఓపీ కార్యాలయం చేరుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.