AP CM Jagan: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను ఏపీ సీఎం జగన్ ఇవాళ కలిసారు. ఇటీవల తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్‌ను ఏపీ సీఎం జగన్ పరామర్శించారు.
తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుకుసుకొని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని.. త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని.. అప్పడివరకు సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు కేసీఆర్.
నేడు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాన్నం 1 గంటకి తొలుత మొదట కరీంనగర్ కు చేరుకోనున్నారు.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడిని సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఆస్కారం లేదన్నారు. ఎన్నికల్లో ప్రజా తీర్పును ఎదుర్కోలేక భౌతిక దాడులు, హత్యా రాజకీయాలకు తెగబడడం సిగ్గుచేటు అంటూ ఆయన మండిపడ్డారు.