జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం కెనడాకు చేరుకుంది. ఈ బృందం SFJ, ఖలిస్థాన్, సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వంటి సంస్థలకు మద్దతూనిస్తూ వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే సంస్థలకు వస్తున్న నిధులు, వాటిని సమకూరుస్తున్న వివిధ సంస్థలు (NGO) పై ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దీన్లో భాగంగానే శుక్రవారం NIA బృందం కెనడాకు చేరుకుంది. నాలుగు రోజుల పర్యటనలో విదేశీ సంస్థలతో ఈ వేర్పాటువాద సంస్థల సంబంధాలపై ముగ్గురు సభ్యుల NIA బృం దం దర్యాప్తు చేస్తుందని…
మొబైల్ ఫోన్లలో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతే అత్యవసరంగా వినియోగించుకునేందుకు పవర్ బ్యాంక్‌లను వినియోగిస్తుంటారు. పవర్‌బ్యాంక్‌లను ఒకసారి ఛార్జింగ్ చేసి దానిని మొబైల్‌కు కనెక్ట్ చేస్తే మొబైల్ బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గత కొంతకాలంగా పెరిగిపోయింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లతో పాటుగా, ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగింది. Read: శతాబ్దం చివరినాటికి… భూవినాశనం తప్పదా… పెట్రోల్, డీజిల్…
బాత్ రూమ్ లో ఓ మహిళ స్నానం చేస్తోంది. కొద్దిసేపు జలకాలాడిన ఆమె కన్ను షవర్ పై పడింది. షవర్ కింద ఒక నల్లటి వస్తువు కనిపించింది. వెంటనే ఏంటా అని దాన్ని పట్టుకొని చూడగానే ఆమె వెన్నులో వణుకుపుట్టింది. అదొక చిన్న సీక్రెట్ కెమెరా అని తెలియగానే స్నానం చేయకుండానే నిలువునా తడిసిపోయింది. గత కొన్ని రోజుల క్రితం షవర్ పడడంతో ఒక పంబ్లర్ ని పిలిచిన ఘటన గుర్తుకు రావడంతో వెంటనే ఆమె పోలీసులను…
సముద్రంలోని బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయడం అంటే అందరికీ ఇష్టమే. ఎండాకాలం వచ్చిందే అంటే ఎక్కడా ఉన్నా సముద్రం బీచ్‌ల ముందు వాలిపోతుంటారు. ఇలా ఎంజాయ్ చేసే సమయంలో సడెన్‌గా సముద్రంలో వింత ఆకారాలు కనిపిస్తే ఏమైనా ఉంటుందా చెప్పండి. గుండెలు జారిపోతాయి. ఎంత భయం లేని వ్యక్తి అయినా సరే భయపడి పారిపోతారు. వేల్స్‌లో హోలీ హెడ్ న్యూయారీ బీచ్ ఉన్నది. ఆ బీచ్‌కి నిత్యం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అలా వచ్చిన…
ఇంట్లో ఉన్న పాత వస్తువులను చాలా మంది బయటపారేస్తుంటారు. అందులో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ తెలియకుండా వాటిని పడేస్తుంటారు. అలా బయటపడేసే ముందు ఒకటికి నాలుగుమార్లు చెక్ చేస్తే ఇలా మీకు కూడా పాత వస్తువుల్లో విలువైన వస్తువులు దొరికే అవకాశం ఉంటుంది కదా. బ్రిటన్‌కు చెందిన 70 ఏళ్ల మహిళ తన దగ్గర ఉన్న పాత వస్తువులను పాత గిల్టు నగలను చెత్తలో పారేద్దామని అనుకున్నది. ఆ పాత వస్తువులను బయటపడేసేందుకు పక్కన పెట్టింది. అదే…
ఎప్పుడు ఎవరు ఎలా సక్సెస్ అవుతారో చెప్పలేం. చిన్నగా ప్రారంభమైన వ్యాపారం ఆ తరువాత విస్తరించి అతిపెద్ద సామ్రాజ్యంగా మారడం సహజమే. దానికి ఓపిక ఉండాలి. సహనంలో పనిచేయాలి. నమ్మకంతో ఆకట్టుకునే విధంగా వ్యవహరించాలి. కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌లో ఓ బిడ్డకు తల్లైన అన్నాబెల్ మార్గిన్నిస్ అనే మహిళ తన ఇంటి నుంచి ఓ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించింది. ఇంట్లోని వంట గదిలో మహిళలకు నెయిల్ పాలిష్ వేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల వారికి బాగా నచ్చడంతో నిత్యం…
దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇటు ఐటీ రాజధానిగా పేరున్న బెంగళూరులో కరోనా కొత్త రకం వేవ్ కలవరం కలిగిస్తోంది. బెంగళూరులో ఓ రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్ధులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. యూకేలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డెల్టా వేరియంట్ AY.4.2 భారత్‌ను కూడా బెంబేలెత్తిస్తోంది. కర్ణాటకలో ఇప్పటివరకూ డెల్టా AY.4.2 కేసులు ఏడు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ కమిషనర్ డి.రణ్‌దీప్ ప్రకటించారు. ఓ రెసిడెన్షియల్ స్కూల్లో 32 కరోనా…
కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలా కుతలం చేస్తున్నది. కరోనా కట్టడికి చాలా దేశాలు లాక్ డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా కరోనాతో ప్రపంచం ఇబ్బందులు పడుతున్నది. అయినప్పటికీ ఇప్పటి వరకు మహమ్మారి పూర్తిగా అంతం కాలేదు. ఎప్పటి కప్పుడు కొత్తగా మార్పులు చెందుతూ విరుచుకుపడుతున్నది. దేశాల ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తోంది కరోనా. ఇక, కరోనా కట్టడికి ప్రతీ దేశం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ వస్తున్నాయి. అన్నింటికంటే అధికంగా బ్రిటన్ కరోనా కట్టడికోసం…
తగ్గినట్టే తగ్గిన కరోనా మహమ్మారి మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది.. బ్రిటన్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. చాపకింద నీరులా వైరస్ విస్తరిస్తోంది. ప్రధానంగా విద్యార్థులు, వృద్ధుల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయి. రోజువారీ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్నవారు, మృతుల సంఖ్య పెరగడం.. వైద్యవ్యవస్థపై ఒత్తిడి పెంచుతోంది. కేసులు తగ్గడం, మెజార్టీ ప్రజలకు వ్యాక్సిన్లు ఇవ్వడంతో జులైలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను పక్కనపెట్టింది. మాస్క్‌లు ధరించాల్సిన పనిలేదని చెప్పింది. దాదాపు అన్ని కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చింది. పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.…
భారతీయులకు బ్రిటన్ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. గతంలో కోవీషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ బ్రిటన్ వచ్చే భారతీయులు తప్పని సరిగా 10 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలని షరతులు విధించిన సంగతి తెలిసిందే. దీనిపై భారత్ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రపంచ ఆరోగ్యసంస్థ అనుమతులు పొందిన వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 10 రోజులు క్వారంటైన్ విధించడం సమంజసం కాదని, క్వారంటైన్ ఆంక్షలు విధిస్తే తాము కూడా అదే బాటలో నడుస్తామని ప్రకటించింది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం…