కరోనా కాలంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వెరైటీగా ఆలోచించి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరికొందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉన్నదానితో సంతృప్తి చెందుతున్నారు. అయితే, బ్రిటన్‌కు చెందిన జొనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. కాస్త వెరైటీగా ట్రై చేయాలని భావించిన జొనాథన్ స్విఫ్ట్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను కరపత్రంపై ముద్రించాడు. దానిపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ కరపత్రాలను…
కరోనా నుంచి కోలుకున్నవారికి బ్రిటన్ శాస్త్రవేత్తలు షాకింగ్ న్యూస్ వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత పలువురికి ఊపిరితిత్తుల్లో లోపాలు ఉన్నట్లు తమ పరిశోధనలో స్పష్టమైందని బ్రిటన్ సైంటిస్టులు చెప్పారు. కరోనా వైరస్ వల్ల అంతర్గతంగా ఊపిరితిత్తులకు పెద్దఎత్తున నష్టం జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. అయితే సాధారణ పరీక్షల్లో ఈ లోపం బయట పడకపోవచ్చని వారు సూచించారు. పోస్ట్ కోవిడ్ తర్వాత పలువురిలో శ్వాస తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు.. అయితే అది అలసట వల్ల జరుగుతుందా…
కరోనా కాలంలో లక్షలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రజలు అనే ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏ పని దొరికితే ఆ పని చేస్తున్నారు. పనికోసం పాట్లు పడుతున్నారు. అయితే, బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్డీ బెక్కెట్ అనే వ్యక్తి వెరైటీగా పనిచేస్తే రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. అదెలా అంటే, రోజులో గంటల కొద్ది క్యూలైన్లో నిలబడటం. గంటల కొద్ది క్యూలైన్లో నిలబడి తన వంతు వచ్చిన తరువాత కావాల్సివ వస్తువులను కొని తీసుకొని…
ఒకప్పుడు భారత దేశాన్ని దోచుకున్న ఆంగ్లేయులకు ఇప్పుడు ఓ భారతీయుడు ప్రధాని కాబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌పై ప్రస్తుతం ఉద్వాసన కత్తి వేలాడుతోంది. దీంతో తదుపరి ప్రధానిగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతత వ్యక్తి, బ్రిటన్ ఆర్ధిక మంత్రి రిషి సూనక్ నియమితులవుతారని బ్రిటన్ మీడియా కథనాలు ప్రచురించింది. 2020 మే నెలలో కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ప్రధాని బోరిస్ పెద్ద ఎత్తున మందు పార్టీ చేసుకున్నారన్న…
పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మ్యాట్రిమోనీని సంప్రదించడమో లేదంటే తెలిసిన వారిని సంప్రదించడమో చేయాలి. కానీ, ఆ వ్యక్తి వినూత్న రీతిలో తనకు వధువు కావాలని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. తనకు తగిన వధువును వెతికిపెట్టాలని చెప్పి బిల్‌బోర్డ్ ఎక్కాడు. మొదట దానిని ప్రాంక్ అనుకున్నారు. కానీ, అది ప్రాంక్ కాదని, నిజంగానే తనకు వధువు కావాలని చెప్పడంతో ఆ వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారిపోయాడు. ఈ సంఘటన బ్రిటన్‌లో జరిగింది. Read: విందుభోజనం కోసం…
కరోనా, ఒమిక్రాన్‌తో యూకే వణికిపోతున్నది. ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. క్రిస్మస్ తరువాత కేసులు మరింతగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మంగళవారం రోజున యూకేలో 1.30 లక్షల కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలియజేసంది. కేసులతో పాటు ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ లండన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిపోయింది.…
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం.…
ఒమిక్రాన్ వేరింయంట్‌తో ప్రపంచం ఉలిక్కిపడింది. ఇప్పటికే ఐరోపాదేశాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు కొన్ని దేశాలు లాక్డౌన్ దిశగా వెళ్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్‌పై జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఆదేశాలు జారీ చేస్తూ ఒక విషయాన్ని ఉటంకిస్తూ రాష్ర్ట ప్రభుత్వాలను హెచ్చరించింది.బ్రిటన్‌లాంటి పరిస్థితి మన దేశంలో తలెత్తితే మన జనాభా ప్రకారం రోజుకు 14లక్షల ఒమిక్రాన్ కేసుల నమోదు అవుతాయని కేంద్రం పేర్కొంది. Read Also: బెయిల్ మంజూరుకు కారణాలు అవసరం లేదు బ్రిటన్‌లోని కరోనా వ్యాక్సిన్…