కరోనా కాలంలో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త కొలువుల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వెరైటీగా ఆలోచించి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. మరికొందరూ ఉద్యోగాల కోసం ప్రయత్నించి ఉన్నదానితో సంతృప్తి చెందుతున్నారు. అయితే, బ్రిటన్‌కు చెందిన జొనాథన్ స్విఫ్ట్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. కాస్త వెరైటీగా ట్రై చేయాలని భావించిన జొనాథన్ స్విఫ్ట్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌ను కరపత్రంపై ముద్రించాడు. దానిపై బార్‌కోడ్‌ను ఏర్పాటు చేశాడు. ఆ కరపత్రాలను కార్లపై వరసగా ఉంచుకుంటూ వెళ్లాడు.
Read: వైరల్: సముద్రంలో బోటును వెంబడించిన వింతజీవి… క్షణం ఆలస్యమైతే…
అయితే, కరపత్రం తయారు చేయించుకునేందుకు యార్క్‌షైర్‌లోని ప్రింటింగ్ స్పెషలిస్ట్ ఇన్‌స్టాప్రింట్ సంస్థ వద్దకు వెళ్లి ప్రింటింగ్ కు ఇచ్చాడు. తన మార్కెటింగ్ స్కిల్స్ నచ్చిన ఆ సంస్థ జొనాథన్‌ను పిలిచి ఇంటర్వ్యూచేసి ఉద్యోగం ఇచ్చింది. జొనాథన్ మార్కెటింగ్ స్కిల్స్ బాగున్నాయని, ఉద్యోగం కోసం ఆయన ఎంచుకున్న తీరు నచ్చిందని, అప్పటికే మార్కెటింగ్ లో ఉద్యోగికోసం ఆ సంస్థ ఇంటర్వ్యూలు చేస్తుండటంతో జొనాథన్‌కు అవకాశం దక్కింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నది.
Here’s some CCTV footage of the #jobseeker in action! He’s been the talk of the office since covering everyone's cars in CVs. I love it when we get a #creativejobapplication – Craig, Marketing Manager pic.twitter.com/OmE5puQgwI
— instantprint (@instantprintuk) January 18, 2022