ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వచ్చే ఏడాది నాటికి 100 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా మారబోతున్నదా అంటే అవుననే చెబుతున్నాయి గణాంకాలు. ఈ ఏడాది 194 దేశాల ఆర్థిక వ్యవస్థలు 94 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, వచ్చే ఏడాదికి 100 ట్రిలియన్ డాలర్లుగా మారొచ్చని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది. మొదట 2024లో 100 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసినా, దానికంటే ముందే ఈ మార్క్‌ను చేరుకోబోతుందనే వార్తలు రావడం విశేషం. ప్రపంచంలో వేగంగా ఆర్థికంగా అభివృద్ది చెందుతున్న దేశాల కేటగిరిలో ఇండియా ప్రస్తుతం ఏడో స్థానంలో ఉండి.
Read: ముందే చెప్పాం అయినా మార్పు రాలేదు : పేర్ని నాని
వచ్చే ఏడాది ఫ్రాన్స్ ఆర్థిక వ్యవస్థను ఇండియా దాటే అవకాశం ఉంది. 2023 లో బ్రిటన్‌ను దాటి ఐదో స్థానంలోకి చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. 2030 వరకు ఇండియా ప్రపంచంలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, అదే సమయంలో చైనా అమెరికాను ఆర్థిక వ్యవస్థను దాటి మొదటిస్థానంలోకి చేరుకుంటుందని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ తెలియజేసింది.