Rajanna Siricilla: పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి పారిపోయిన అక్క.. అక్క స్థానంలో పెళ్లికి సిద్ధమైన చెల్లి.. చివరకు
- పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి పారిపోయిన అక్క
- అక్క స్థానంలో పెళ్లికి సిద్ధమైన చెల్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇద్దరి ఇష్టాలతో జరిగితేనే ఆ పెళ్లికి ఓ అర్థం. ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వారి దాంపత్య జీవితం నిత్య నరకమే. అందుకే అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే ముందుకు సాగుతుంటారు పెద్దలు. ఇదే విధంగా ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది వధువు. తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో తాను ప్రేమించిన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.
Also Read:Crime News: కార్లు రెంటుకు తీసుకొని 50 లక్షల టోకరా!
Also Read
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో 'గ్రూప్ ఆఫ్ డెత్'గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ కు చెందిన అనిత అనే యువతికి, హుస్నాబాద్ కు చెందిన మొగిలికి నిన్న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే అనిత ప్రియుడితో పారిపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అనిత ప్రియుడితో పారిపోవడంతో అనిత చెల్లెలు లలితతో అక్కకు నిశ్చయించిన రోజునే పెళ్లి చేసేందుకు సిద్ధమయ్యారు తల్లిదండ్రులు. అదే వరుడికి చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. లలిత మైనర్ అని అధికారులకు సమాచారం ఇచ్చాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి.
Also Read:Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు!
సమాచారం అందుకున్న వెంటనే ఐసిడిఎస్ అధికారులు, పోలీసులు పెళ్లి మండపానికి చేరుకుని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. మైనారిటీ తీరకుండానే పెళ్లి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంతలోనే చెల్లెలు లలిత కూడా ఇంట్లో నుంచి పరారైంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ఊహించని ఘటనతో తల్లిదండ్రులు, బంధువులు అయోమయంలో పడిపోయారు. ఇది తెలిసిన పలువురు ప్రేమ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉన్నప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహానికి ఒప్పుకోవడం ఎందుకు ఆ తర్వాత పెళ్లి ఇష్టం లేదని పారిపోయి కన్న వారి పరువు తీయడం ఎందుకు అని కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
-
Shaikpet Flyover : షేక్‌పేట్ ఫ్లైఓవర్‌పై నుంచి పడ్డ పైపు.. స్కూటర్ నజ్జునుజ్జు
-
Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
-
Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
-
Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!