పెళ్లి ప్రతిఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. కానీ, కొందరి జీవితాల్లో మాత్రం పీడకలగా మారిపోతోంది. పెళ్లైన కొంతకాలానికే మనస్పర్థలు, గొడవల కారణంగా విడిపోవడం, ప్రాణాలు తీసుకోవడం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన మంచిర్యాలలో చోటుచేసుకుంది. ఓ నవవధువు పెళ్లై నెల రోజులు తిరగకముందే ఆత్మహత్యకు పాల్పడింది. తమ కూతురు అత్తారింట్లో భర్త, పిల్లాపాపలతో సంతోషంగా జీవించాలని ఆశపడిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
Also Read:Karnataka: నా వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నా.. మహిళలకు హోంమంత్రి క్షమాపణ
గత నెల 16వ తేదీన గొల్లపల్లి గ్రామానికి చెందిన సాయికి, టిక్నాపల్లి గ్రామానికి చెందిన శృతితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 8 తులాల బంగారం, లక్ష రూపాయల నగదుతో పాటు పెట్టుబోతలతో వైభవంగా వివాహం జరిపించారు యువతి తల్లిదండ్రులు. అయితే పెళ్లి అయిన వారం నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు. పెళ్లి ఖర్చు రూ. 6 లక్షలు అయిందని ఆడబ్బులు వధువు తల్లిదండ్రులు ఇవ్వాలని శృతిపై అత్తింటివాళ్లు ఒత్తిడి చేశారు.
Also Read:High Tension in Raptadu: పరామర్శకు వెళ్లిన వైఎస్ జగన్.. రాప్తాడులో టెన్షన్ టెన్షన్..!
అదనపు కట్నం వేధింపులు తాళలేక శృతి మానసికంగా కుంగిపోయింది. ఈ క్రమంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. స్నానాల గదిలో ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది శృతి. అత్తింటి వేదింపులతో నవవధువు శృతి (21) ఆత్మహత్య చేసుకుంది. పెళ్లై నెల రోజులు గడవకముందే తమ కూతురు ప్రాణాలు కోల్పోవడంతో మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.