గంజాయి, మత్తు పదార్థాలు సాగుచేస్తున్న, రవాణా వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. గంజాయి సాగు చేస్తున్న రైతుల, పండిస్తున్న భూముల వివరాలను సేకరించి రైతుబంధు డబ్బులు రాకుండా వ్యవసాయ శాఖ అధికారులచే ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు కృషి చేయాలని మంత్రి సూచించారు. ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో గంజాయి రవాణా చేస్తున్న వారిపై, అనుమానితులపై నిఘా ఉంచాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గంజాయి రవాణా చేస్తున్న సాగుచేస్తున్న…
సిద్దిపేట జిల్లాలోని కొమురవెళ్లి మల్లికార్జున స్వామి వారిని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సమేతంగా దర్శించుకొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందన్నారు. కొమురవెళ్లి మల్లన్న మా ఇంటి కులదైవం ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఆలయాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఆలయం వద్ద భక్తులకు మెరుగైన వసతులు…
జహీరాబాద్ ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించిన అనంతరం మంత్రి హరీశ్ రావు జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. అన్ని వార్డులను కలియ తిరిగారు. ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. 50 పడకలతో ఎంసీహెచ్ కేంద్రాన్ని ఏరియా ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటుచేస్తామన్నారు.కేసీఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు పెరిగాయాన్నారు. ప్రస్తుతం 52 శాతం డెలివరీలు జరుగుతున్నాయని దీన్ని 75 శాతంకు పెంచాలన్నారు. జహీరాబాద్ లోనూ ప్రభుత్వ ఆస్పత్రిలో నార్మల్ డెలివరీలు…
గ్రీన్ఇండియా చాలెంజ్ లో పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం.చెట్లు నాటడం అంటే దైవకార్యం తో సమానం అని ఆమె అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా డా.పద్మజారెడ్డి మాట్లాడుతూ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని,…
కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు అని పార్టీల నాయకులు చెప్పిన వినకుండా కేసీఆర్ మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నర్సంపేట…
పీఆర్సీపై ఏపీలో దుమారం రేగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 11వ పీఆర్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పీఆర్సీ పై ఉద్యోగసంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం వద్దు కానీ.. ఆర్టీసీ ఆదాయం మాత్రం కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు.. ప్రమోషన్లు తక్షణం చేపట్టాలని అన్నారు. ఆర్టీసీ ఆస్పత్రులన్నీ అప్డేట్ చేయాలని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పేరు…
ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ పై ఉద్యోగ సంఘాల నేతలు విముఖతతో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితి గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు మంత్రులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు రావాలంటూ ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు చర్చకు రావడం లేదు మంత్రుల కమిటీ వెల్లడిస్తోంది. ఈ…
బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో అంబుడ్స్ మెన్ పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ ఫిర్యాదు చేశారు. హెచ్ సీఏ ప్రస్తుత కార్యవర్గాన్ని జింఖానా ఆఫీస్ లో అంబ్బుడ్స్ మెన్ వారు భయపెడుతున్నారు అంటూ ఫిర్యాదులో హెచ్ సీఏ అధ్యకుడు అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అజారుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బేగంపేట్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు గతంలో సస్పెండ్ చేసిన అంబడ్స్ మెన్ కు మధ్య…
ఒక ముఖ్యమైన నిర్ణయంలో, మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం గురువారం కొత్త వైన్ పాలసీలో భాగంగా రాష్ట్రంలో తయారు చేసిన వైన్లను విక్రయించడానికి అన్ని సూపర్ మార్కెట్లను అనుమతించిందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ తన అన్ని విమానాశ్రయాలలో మద్యం అమ్మకాలకు, నాలుగు ప్రధాన నగరాల్లో ఎంపిక చేసిన సూపర్ మార్కెట్లకు మరియు సంవత్సరానికి…
నూతన జిల్లాల ఏర్పాటులో ప్రజలు అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తెస్తే పరిష్కరించి ముందుకు వెళ్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గుడివాడలో ఏదో జరిగిందని ఛీర్ బాయ్ లతో చంద్రబాబు కమిటీ ఏర్పాటు చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు టీడీపీకి రాష్ట్రంలో ఏ అంశమూ లేదని, ఏ అంశం లేకే గుడివాడ అంశంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేయడం…