ఇది రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం : బోరెడ్డి అయోధ్య రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వద్ద టీపీసీసీ తరపున టీపీసీసీ అధికార ప్రతినిధి, సమన్వయ కర్త బోరెడ్డి అయోధ్య రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పేదలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ సంస్థలు 2022-23 సంవత్సరానికి టారిఫ్ లను ప్రతిపాదించాయని, పేదల మీద ఇప్పుడు ఉన్న విద్యుత్ చార్జీలకు అదనంగా 55.20 శాతం పెంపునకు ప్రతిపాదనలు పంపాయని ఆయన అన్నారు. ఈ పెంపు నెలకు 50 యూనిట్లకు లోపు వినియోగదారుల మీదనే పడుతుందని, 51-100 యూనిట్లు వాడే వినియోగదారుల మీద 39.50 శాతం భారం పడనుందని ఆయన తెలిపారు. 800 యూనిట్లకు పైగా విద్యుత్ ను వాడే వినియోగదారుల మీద 8.9 శాతం మాత్రమే అదనంగా భారాన్ని మోపుతున్నారాని ఆయన అన్నారు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద చూపుతున్న కోపానికి నిదర్శనం అన్ని ఆయన మండిపడ్డారు.
72.50 రూపాయల చార్జీలు చెల్లిస్తున్న పేదలు ఏప్రిల్ నుంచి 112.50 చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు ఖాళీగా ఉంటే ఇప్పుడు నెలకు 55 రూపాయలను కనీస చార్జీ ఉంది. అది వచ్చే నెల నుంచి 150 రూపాయలు చెల్లించాలి. ఇది 173 శాతం అదనంగా పెంచారు. తక్కువ ధరతో రామగుండం ప్లాంటు నుంచి కొనడం ఆపేసి భద్రాద్రి, యాదాద్రి ప్లాంట్ల నుంచి ఎక్కువ ధరకు కొంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించాయి. విద్యుత్ 84,222 మిలియన్ యూనిట్లు అవసరం అని పంపిణీ సంస్థలు అంటున్నాయి. గత ఏడాది కన్నా ఇది16.69 శాతం ఎక్కువ. ఇంత విద్యుత్ వినియోగం ఉండదు. జెన్ కో సంస్థలు కేవలం 55 శాతమే సామర్ధ్యం ఉత్పత్తి చేస్తున్నది. ఉత్పత్తి సామర్ధ్యము పెంచితే కొనాల్సిన అవసరం తక్కువ. 698 విద్యుత్ ప్రమాదాలు జరిగాయి. దీనికి 529 కోట్లు పరిహారం. భద్రతా చర్యలు లేక పోవడం వల్ల ఈ దారుణమని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!