తెలంగాణ కోసం పార్లమెంటు సభ్యులుగా మేమంతా ఆరోజు పోరాడాం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు. నిరుద్యోగ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలేనని ఆయన ఆరోపించారు. ఒకే కులానికి మంత్రి పదవులు ఉన్నాయని, ఇతర కులాలకు పనికిరాని పదవులు ఉన్నాయని ఆయన అన్నారు. కేంద్రంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు..ఉద్యోగాలు అక్కడ లేవు..ఇక్కడ లేవు.. ఉద్యోగాలు వచ్చే వరకు పోరాడతామన్నారు.
రైతులను బీజేపీ, టీఆర్ ఎస్ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఎన్నికల్లో మాయమాటలు చెప్పి రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ గద్దెనెక్కారని ఆయన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలకు తగిన బుద్ది చెబుతారని ఆయన అన్నారు.