తెలంగాణ లో నిరుద్యోగ భృతి ఇస్తా అని మూడేళ్ళయింది.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనా రెడ్డి అన్నారు. నిరుద్యోగుల యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయని, యువకుడు ముత్యాల సాగర్ చనిపోవడం బాధాకరమన్నారు. అసెంబ్లీ ల ముట్టడి చేసాం.. రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత చనిపోయారు…ఆ అమరవీరుల సాక్షిగా గన్ పార్క్ వద్ద ధర్నా చేపట్టాం ,నివాళులు అర్పించామని ఆయన అన్నారు. సీఆర్ నిరుద్యోగ ఆత్మహత్యలు కనిపించడం లేదా.. 2018 లో ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పింది దానిని మేము ఇస్తామని కాపీ కొట్టినవ్ అని ఆయన మండిపడ్డారు.
2018 బిస్వాల్ కమిటీ ద్వారా లక్షా 91 వేల ఉద్యోగాలు ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం 50 లక్షల మంది ఎదురు చూస్తున్నారని, టీఎస్పీస్సి ద్వారా 26 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి.. 3000 నిరుద్యోగ భృతి చెల్లించాలి.. తెలంగాణ లో ఉన్న నిరుద్యోగి కి ప్రభుత్వం లక్ష రూపాయల అప్పు ఉంది.. బీజేపీ, టీఆర్ఎస్ ఇక్కడ కొట్లాట ఢిల్లీలో దోస్తీ.. నిరుద్యోగుల పట్ల మిలియన్ మార్చ్ చేస్తానంటున్న బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మీ ఎంపీల దగ్గర ధర్నా లు చేయాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.