Jyoti Venkatesh: అవును, రామ్‌గోపాల్ వర్మ, ఊర్మిళ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jyoti Venkatesh: బాలీవుడ్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన నటి ఊర్మిళా మాతోండ్కర్, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)ల అనుబంధంపై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగిందనే వార్తలు దశాబ్దాలుగా చెక్కర్లు కొడుతున్నాయి. అయితే బాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. ఊర్మిళా మాతోండ్కర్, రామ్ గోపాల్ వర్మకు వివాహమైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిద్ధార్థ్ కనన్ పోడ్కాస్ట్లో జ్యోతి వెంకటేష్ ఈ విషయాలను వెల్లడించారు. ఒకసారి ఓ ప్రముఖ తెలుగు హీరో తనను కలిసినప్పుడు, ఆర్జీవీ-ఊర్మిళా పెళ్లి చేసుకున్న విషయం ఎందుకు రాయడం లేదని అడిగారట. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఆలయంలో వీరి పెళ్లి జరిగిందని చెబుతూ, ఆ వివాహం జరిపించిన పూజారి ఫోన్ నంబర్ కూడా ఇచ్చారట. ఈ వార్తను ప్రచురించే ముందు తాను ఊర్మిళకు ఫోన్ చేయగా, ఆమె ఏడుస్తూ తనపై అసంతృప్తి వ్యక్తం చేసింది తప్ప పెళ్లి జరగలేదని ఖండించలేదట. మరోవైపు ఆర్జీవీని ప్రశ్నించగా ఆయన దీనిపై మాట్లాడటానికి నిరాకరించారట. వీళ్లు విడిపోవడానికి కారణాలను సైతం జ్యోతి వెంకటేష్ వివరించారు. ఊర్మిళ ఆర్జీవీతో చట్టబద్ధంగా (లీగల్‌గా) పెళ్లి బంధంలోకి అడుగుపెట్టాలని కోరుకుందని, కానీ ఆర్జీవీ దానికి సిద్ధపడకపోవడంతో ఇద్దరూ విడిపోయారని తెలిపారు.
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉండగా.. ‘అంతం’, ‘గాయం’, ‘రంగీలా’, ‘సత్య’.. ఇలా రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) తెరకెక్కించిన చిత్రాల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు పొందిన నటి ఊర్మిళా మాతోండ్కర్ (Urmila Matondkar). హిట్ కాంబినేషన్‌గా నిలిచిన వీరిద్దరు ఆ తర్వాత మళ్లీ కలిసి పనిచేయకపోవడంపై బాలీవుడ్లో పలు ఊహాగానాలు వచ్చాయి. అయితే.. గతేడాది ‘సత్య’ రీ రిలీజ్ సందర్భంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ‘మీ మధ్య విభేదాలా?’ అనే ప్రశ్న ఎదురవగా ఊర్మిళా మాతోండ్కర్ స్పందించారు. డైరెక్టర్‌తో అభిప్రాయభేదాల్లేవని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!