Suriya 48 : ఎగ్మోర్‌లో జెట్ స్పీడ్‌లో సూర్య- టి.జె. జ్ఞానవేల్ షూటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ వర్సటైల్ నటుడు సూర్య ఇటీవల వచ్చిన కరుప్పు సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో రూ. 350 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఆ సినిమా హిట్ తో జోష్ మీదున్న సూర్య నెక్ట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో విశ్వనాధ్ అండ్ సన్స్ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లో తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ చేసాడు సూర్య. ఈ నేపథ్యంలో ‘జై భీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు సూర్య.
భారీ బడ్జెట్ పై సూర్య కెరీర్ లో 48వ సినిమాగా తెరకెక్కుతున్నఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ప్రస్తుతం చెన్నైలోని ఎగ్మోర్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ షెడ్యూల్లో సూర్య, కథానాయిక కయాదు లోహర్ లపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. నిజ జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో సూర్య ఒక డాక్టర్ పాత్రలో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్’, ‘కాంతార’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హొంబాలే ఫిల్మ్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం సాయి అభ్యంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ‘జై భీమ్’ వంటి నేషనల్ లెవెల్ సెన్సేషన్ తర్వాత సూర్య – జ్ఞానవేల్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై సినీ వర్గాల్లోనూ అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read
తాజావార్తలు
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!