బీఆర్ఎస్ నాయకులు మా జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల ఇచ్చారో చెప్పి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక అమలు కాలేదని, రెండు టీఎంసీల రాలేదు రెండు వేల కోట్లతో మూడో టిఎంసి అన్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి. కానీ మేము కడితేనె వస్తున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే.. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దతో మాట్లాడుతూ.. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..? అని, కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారన్నారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారని, వారు…
రాష్ట్ర బడ్జెట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందిస్తూ.. కాంగ్రెస్ + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని వ్యంగ్యస్త్రాలు సంధించారు. 6 గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిద గుడ్డేనా? అని, గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో… కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం అంతే నిజమనే దానికి బడ్జెట్ నిదర్శనమిని ఆయన విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క గారు… మీరు చదివింది ఆర్థిక బడ్జెట్టా…
ఓ..హోటల్లో చోరీ చేసేందుకు సిద్దమైన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఉండడానికని ఏంతో జాగ్రత్తగా ప్లాన్ వేసి చేతులకు గ్లౌజ్‌లు, ముఖానికి మంకీక్యాప్ ధరించి.. తను ఎంచుకున్న స్పాట్ వద్దకు చేరుకున్నాడు. సీరియస్ గా తాళం బద్దలుకొట్టి లోపలికి వెళ్లిన ఆ దొంగకు నిరాశ ఎదురైంది. దీంతో ఏం చేయాలో అర్థం కానీ ఆ దొంగ ఒకే సీన్లో ఇద్దరు తెలుగు ప్రముఖ కమెడియన్స్ గుర్తుకు వచ్చినట్లుంది. వచ్చిన పని ఎలాగో…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నేడు కేంద్ర బడ్జెట్‌పై తీర్మానం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారన్నారు. తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారని, గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదన్నారు. గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదని, మేం అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఢిల్లీ వెళ్లామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు వాగ్వాదాల నడుమ నడిచింది. కేంద్రాని ప్రశ్నించేందుకు ఎందుకు కలిసి రారు అని బీఆర్ఎస్ను కాంగ్రెస్ టార్గెట్ చేయగా.. కేసీఆర్‌పై కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేయవద్దంటూ బీఆర్ఎస్ శ్రేణులు వాదనలు చేశారు. అయితే.. చివరగా.. కేంద్రం బడ్జెట్లో తెలంగాణకు తీవ్రం అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే మొదటి నుంచి ప్రధాని మోడీకి చిన్నచూపు అని…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతు్న్నాయి. బీఆర్ఎస్- కాంగ్రెస్ ల మధ్య చర్చలు హీటును పుట్టించాయి. అయితే.. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించామని మేము ఎప్పుడూ చెప్పలేదని, మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మని చెప్పండని, నేను కూడా దీక్షలో కూర్చుంటానని ఆయన సవాల్ విసిరారు. ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చూద్దామని సీఎం రేవంత్ ఉద్ఘాటించారు. రూ.వంద పెట్టి పెట్రోల్…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. అయితే ఈ సందర్భంగా అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. నేను మాట్లాడటానికి మూడు సార్లు లేచానని, కాంగ్రెస్ – బీ ఆర్ ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని ఆరోపించారు. అందుకే నన్ను మాట్లాడనివ్వకుండ విషయాన్ని డైవర్ట్ చేస్తున్నారన్నారు. గత బడ్జెట్ లో నాలుగు వేల కోట్ల రూపాయలు ఒకే నియోజక వర్గానికి మీరు ఇచ్చినప్పుడు అది మిగతా జిల్లాలను విస్మరించడమేనా? అని ఆయన ప్రశ్నించారు.…
అసెంబ్లీలో శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత ప్రమాదకరంగా ఉందని, రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అనుసరించాల్సిన సమైక్య న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014 అనుగుణంగా నిధుల కేటాయింపు జరగలేదని ఆయన మండిపడ్డారు. షెడ్యూల్ తొమ్మిది, పది అంశాలని పట్టించుకోలేదని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం కులమత బేదాలకు తావులేకుండా బడ్జెట్ ఉంటుందని చెప్పారన్నారు…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. తెలంగాణ ఏ రైతు అప్పుల పాలు కావద్దని భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ వరంగల్ డెకరేషన్ లో చెప్పిండన్నారు. మంత్రివర్గమంతా దృఢ సంకల్పం నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాటను శిలాశాసనంగా భావించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ…