ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత మొదటిసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు సాయంత్రంతో ముగియనుండటంతో ఆయన సాయంత్రం ఢిల్లీకి పయమనమవుతారు. సమావేశాలు ముగిసిన తరువాత సాయంత్రం 5గంటలకు చంద్రబాబు ఢిల్లీకి బయలు దేరుతారు. . సాయంత్రం 5.10గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న చంద్రబాబు.. రాత్రి 7.30గంటలకు ఢిల్లీ విమానాశ్రయంకు చేరుకుంటారు. రాత్రి 8గంటలకు వన్ జన్ పథ్ రోడ్డుకు…
బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు, విలువైన వస్తువులు లాక్కొని మహిళపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానితుడు, సాహిల్ ఖాన్ అలియాస్ మహ్మద్ అఫ్సరుద్దీన్ 2018 లో మహిళతో స్నేహం చేసి, ఆమెతో సంబంధాన్ని పెంచుకున్నాడు. ఓ సమావేశంలో సాహిల్ ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. “సాహిల్ మరో ఇద్దరు మజిద్ మరియు అబూ ద్వారా మహిళ నుండి రూ. 4…
సమాజంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థలో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వుండాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. సర్వీసుల్లో వికలాంగుల కోటా పై తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ, ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ స్పందించారు. దివ్యాంగుల పై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్న మంత్రి.. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, పర్యవసనాలను ఆలోచించకుండా…
అభూతకల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతుష్టీకరణ తప్ప బడ్జెట్లో ఏమి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఏమీ కనిపించలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ తుంగలో తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంటపెట్టుబడి సాయం(రైతు బంధు/రైతు భరోసా)కు బడ్జెట్ లో ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు కిషన్ రెడ్డి. బడ్జెట్ మొత్తంలో ఆసరా పెన్షన్ల ప్రస్తావనే లేదు. పెన్షన్లు పెంచుతామని మోసం చేశారని, మహిళలకు…
రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పా రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ “అబద్ధాల పుట్టా” అని ఆమె వ్యాఖ్యానించారు. 18 ఏండ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలేవి..? రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు అన్నరు..ఆ సంగతేంది..? అని ఆమె అన్నారు. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటిరి.. మరి వాటి ప్రతిపాదనలేవి..? నిధులెక్కడ..?…
ఊహల బడ్జెట్ కేసీఆర్ ది… వాస్తవ బడ్జెట్ కాంగ్రెస్ ది అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఆలోచన అప్పుల మీద.. రేవంత్…భట్టి లది అభివృద్ధి ఆలోచన అని అన్నారు. వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇచ్చి కాంగ్రెస్ మరోసారి రైతు ప్రభుత్వం అని నిరూపించుకుందని, 10 వేల కోట్లతో హైద్రాబాద్ దశ మారుతుంది… కేసీఆర్ కి ఎందుకు కుళ్ళు అని ఆయన మండిపడ్డారు. చీల్చుడు లో మేమే…
తెలంగాణ వైద్య మండలి మరోసారి నకిలీ వైద్యుల భరతం పట్టింది. బుధవారం నాడు హైదరాబాద్ మహానగరం లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కిన్, లేజర్ , కాస్మెటలజీ సెంటర్స్ పైన ఏక కాలంలో 5 బృందలుగా ఏర్పడి జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, మాధపూర్ , హైటెక్ సిటీ, కూకట్ పల్లి , మియాపూర్ ప్రాంతా ల్లో మొత్తం 40 సెంటర్స్ పై తనిఖీ నిర్వహించారు. ఇందులో ముగ్గురు నకిలీ వైద్యులను గుర్తించి FIR ఫైల్ చేయనున్నట్లు , మరో…
ఆత్మ స్తుతి పర నింద లా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆరు గ్యారంటీ లు నీరు గారిపోయాయని, అంకెల గారడీల రాష్ట్ర బడ్జెట్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల ముందు గ్యారంటీలా గారడి అని, రాష్ట్రాన్ని తిరోగమన దిశలో బడ్జెట్ ఉందన్నారు హరీష్ రావు. ఇచ్చిన హామీల ప్రస్తావన ఏ ఒక్కటి లేదని, అప్పులు తెస్తామని మళ్ళీ చెప్తుందన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ తన మేనిఫెస్టో మర్చిపోయిందని, 2,500…
బీఆర్ఎస్ నాయకులు మా జిల్లాలో ఉన్న లోయర్, మిడ్ మానేరు డ్యామ్ పరిశీలనకు వెళ్తున్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కరీంనగర్ జిల్లాకు ఎన్ని టీఎంసీల ఇచ్చారో చెప్పి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 టీఎంసీల కోసం తీసుకున్న ప్రణాళిక అమలు కాలేదని, రెండు టీఎంసీల రాలేదు రెండు వేల కోట్లతో మూడో టిఎంసి అన్నారని, వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయి. కానీ మేము కడితేనె వస్తున్నాయి అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే.. అనంతరం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దతో మాట్లాడుతూ.. బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రియాక్షన్‌పై భట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ నిన్న ఎందుకు సభకు రాలేదని ప్రశ్నించారు. ఇంతే హడావుడిగా వెళ్లి కేంద్ర బడ్జెట్‌పై ఎందుకు మాట్లాడలేదు..? అని, కేంద్ర ప్రభుత్వం చెబితే హడావుడిగా వచ్చారన్నారు. వారు చెబితేనే వెళ్లి హడావుడిగా మా మీద మాట్లాడారని, వారు…