ఇటీవల కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు గీతారెడ్డి మాట్లాడుతూ.. చిన్న రాష్ట్రాల ఏర్పాటు అంబేద్కర్ పెట్టిన బిక్ష అని అన్నారు. అంతేకాకుండాఅలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఎలా అనిపించిందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా రాజ్యాంగము ఏ ఒక్కరిదీ కాదని, అందరికీ సమనాహక్కులు కల్పించింది రాజ్యాంగమని ఆమె వెల్లడించారు. రాజ్యాంగము మార్చాలనే అహంకారం ఎక్కడి నుండి వచ్చిందని ఆమె మండిపడ్డారు. కావాలంటే ఆమైంద్ మేంట్స్…
మహిళను బానిస లాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్ ది అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. . ఆస్తిలో హక్కులు కల్పించి లింగ వివక్ష లేకుండా చేసింది రాజ్యాంగము అని, రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలని అనుకుంటున్నావు కేసీఆర్, అందరికీ సమాన హక్కులు..వాక్ స్వతంత్రం.. భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అని ఆయన ఆరోపించారు. మోడీ పర్యటన.. అంతా రామానుజ చార్యుల…
ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు ఏపీలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. అయితే నేడు గాన కోకిల లతా మంగేష్కర్ మరణించిన నేపథ్యంలో ఆమె మృతిపట్ల బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా రెండు నిమిషాలు మౌనం పాటించి నేతలు నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాట్లాడుతూ.. లతా మంగేష్కర్…
బడ్జెట్ పై అవగాహన కల్పించేందుకు విజయవాడలో నేడు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని, కోవిడ్ వల్ల ప్రాణాలతో పాటు ఆర్ధికంగా నష్టపోయామని, థర్డ్ వేవ్ వచ్చినా వ్యాక్సిన్ అందించడం వల్లే ప్రాణ నష్టం జరగలేదని ఆయన అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. ఉత్సవాలు జరుగుతున్న తరుణంలో చాలా ప్రాధాన్యత గల బడ్జెట్…
సీఎం కేసీఆర్ పై మరోసారి తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవకాశావాదానికి పరాకాష్ట కేసీఆర్ అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ మాటలు వింటే నాకంటే ఎక్కువ రంగులు మార్చేటోడు కూడా ఉన్నడా? అని ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఆయన విమర్శించారు. అంతెందుకు… సరిగ్గా 6 ఏండ్ల కింద అంటే 2016 ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్…
ప్రముఖ గాయకురాలు లతా మంగేష్కర్ ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. భారతదేశపు ముద్దుబిడ్డ లతా మంగేష్కర్ అని, ఆమె మృతి దేశానికే కాదు, సంగీత ప్రపంచానికే తీరనిలోటని ఆయన అన్నారు. లతా మంగేష్కర్ మృతి వార్త తీవ్ర దిగ్భ్రాంతి కల్గించింది. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ…
ప్రభుత్వంతో ఉపాధ్యాయుల చర్చలు విఫలమయ్యాయ యూటీఎఫ్ రాష్ట్ర అధక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాడతామని, ప్రభుత్వంతో పీఆర్సీ సాధన సమితి చర్చలు ఆమోదయోగ్యం కాదని, ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి కార్యచరణ ప్రకటిస్తామని ఆయన అన్నారు. హెచ్ఆర్ఏ, ఫిట్మెంట్ విషయాల్లో తీవ్రంగా విభేదించామని, ప్రభుత్వం టీచర్లుకు 10 శాతమే హెచ్ఆర్ఏ ఇస్తామంటోందని ఆయన మండిపడ్డారు. కనీసం 12 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని, మార్పులు చేయకపోతే పాత హెచ్ఆర్ఏ కొనసాగించాలని ఆయన కోరారు. ఫిట్మెంట్ విషయంలో…
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టినంక మొట్టమొదట మోసం చేసింది దళితులనేని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ వస్తే దళితుడినే మొదటి ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చి ఎన్నికల్లో గెలిచినంక మాట తప్పిండని ఆయన అన్నారు. తానే సీఎం పదవి చేపట్టి దళితులను దారుణంగా మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, దళితుడికి సీఎం పదవి ఏమైందని జనం నిలదీస్తుంటే… చర్చను దారి మళ్లించేందుకు…
యూట్యూబ్ లో 7ఆర్ట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ లో వీడియోలలో బూతుల గురించి అప్పట్లో రచ్చ రచ్చ జరిగింది. ఈ ఛానల్ తో సరయుకు వచ్చిన క్రేజీ అంతాఇంతా కాదు. ఇటీవల సరయు బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో మెరిసింది. అయితే ఇప్పుడు మరోసారి సరయు వార్తల్లో నిలిచింది. ఇటీవల సరయు తన హోటల్ కు ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన సాంగ్ లో హిందువులను కించపరిచారని…
తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవం కన్నులపండువగా కొనసాగుతోంది. పెద్దఎత్తున తరలివస్తున్న భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. భక్తుల పుణ్యస్నానాలతో జంపన్న వాగు కళకళలాడుతోంది. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరున్న మేడారం జాతరకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. ఈ నేపథ్యంలోనే సమ్మక్క సారక్క జాతర కోసం అక్కడ అధికారులు ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే ఆదివారం సెలవు దినం…