తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర వైభవోపేతంగా జరుగుతోంది. నిన్న ప్రారంభమైన తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టంగా చేసింది. మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో చర్యలు చేపట్టింది. మేడారం జాతారను ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించేందుకు క్రింద ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయండి.
రాష్ట్రానికి సూడో విద్యుత్ శాఖ మంత్రిగా షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ వ్యవహరిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ సీఎం చెప్పారని విద్యుత్ శాఖ బాధ్యతలన్నీ షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ కు అప్పగించారన్నారు. విద్యుత్ శాఖకు అవసరమైన అనేక పరికరాలు ఎక్కువ ధరకు ఈ షిరిడీ సాయయే సంస్థే సరఫరా చేస్తోందని, విద్యుత్ శాఖలో ముగ్గురు సీఎండీల నియామకం కూడా కడప రెడ్డికి చెందిన షిరిడిసాయి…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. టీపీసీసీకి అధ్యక్షుడిగా నిమామకమైన తరువాత మొదటి సారి మంగళవారం రేవంత్ రెడ్డి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తామన్న వాతావరణం సృష్టించేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గందరగోళంలో పడేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అంతేకాకుండా కేసీఆర్ మోడీ కోవర్ట్…
ఎవరి టైం ఎప్పుడు మారుతుందో తెలియదు. రోజూ తినడానికి తిండిలేని వారు ఒక్కరాత్రిలో కుబేరులైన సంఘటనలు చాలానే చూశాం. అయితే ఇక్కడ మనకు మరో అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మమ్మికా అనే వ్యక్తి కేరళ రాష్ట్రానికి చెందినవాడు. ఈయన వయసు 60 సంవత్సరాలు. అయితే మమ్మికా రోజూ కూలీ పనిచేసుకొని జీవిస్తున్నాడు. అలాంటి మమ్మికా జీవితంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఓ రోజు మమ్మకా రోడ్డుపై నడుచుకుంటు వెళుతుండగా షరీక్ వయలిల్ అనే…
దాణా కుంభకోణం కేసుకు సంబంధించి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ను దోషిగా నిర్ధారించిన రాంచీలోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది. శిక్షల పరిమాణాన్ని ఫిబ్రవరి 18న ఖరారు చేయనున్నారు. దాణా కుంభకోణంలోని మరో నాలుగు కేసుల్లో ఇప్పటికే దోషిగా తేలిన లాలూ ప్రసాద్ చివరి కేసులో కూడా నిందితుడిగా ఉన్నారు. విచారణ సందర్భంగా కోర్టులో భౌతికంగా హాజరు కావడానికి ఆర్జేడీ అధినేత ఆదివారం రాంచీకి వచ్చారు. లాలూ ప్రసాద్‌కు సంబంధించిన రూ.139.35 కోట్ల డోరండా ట్రెజరీ…
2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్ట పోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వరదలతో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని నేడు సీఎం జగన్ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు. జగన్ బటన్‌నొక్కి నేరుగా 5.17 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో రూ.534.77 కోట్లను జమ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద…
ఆదివాసి కుంభమేళగా పేరుగాంచిన మేడారం సమక్క సారక్క జాతరకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మేడారం జాతరకు నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు సమక్క సారక్కలను దర్శించేందుకు వస్తుంటారు. అంతేకాకుండా తెలంగాణకే సమక్క సారక్క జాతర తలమానికంగా నిలిచింది. అయితే మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు పోలీస్ శాఖ 9 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో…
స్మగ్లింగ్ చేసేందుకు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. తీరా అధికారులకు దొరికి జైలుపాలవుతున్నారు. అయితే తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా విదేశీ కరెన్సీని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సొమాలీయన్ దేశానికి చెందిన మహమూద్ అలీ అనే వ్యక్తి షార్జా వెళ్లేందుకు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్‌ను తన లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించేందుకు యత్నించాడు. అయితే మహమూద్ అలీపై అనుమానం వచ్చిన సీఐఎస్ఎఫ్ ఇంటలిజెన్స్ అధికారులు అతడితో…
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైద్య విద్య, తృతీయ స్థాయి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు పెద్దపీట వేస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ థర్డ్ వేవ్ నుండి బయటపడేందుకు తెలంగాణ విజయవంతంగా చర్యలు చేపట్టడంతో పాటు మల్టీస్పెషాలిటీ హెల్త్ హబ్‌లు, మెడికల్ కాలేజీలు, దాదాపు అన్ని ప్రధాన తృతీయ శ్రేణి ఆసుపత్రులను రూ.6,000 కోట్లతో అప్‌గ్రేడ్ చేయడం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలలో భాగంగా, రాష్ట్ర ప్రభుత్వం…
పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ కేసులో పురోగతి కనిపించింది. పాలిటెక్నిక్ పేపర్ లీకేజ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వాతి కాలేజ్ లో పేపర్ లీకైనట్లు ప్రభుత్వం గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ లీకేజ్ పై ఆపరేషన్ జరుగుతోంది. స్వాతి కాలేజ్ పేపర్ లీకేజి ఘటనలో నలుగురు అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు కాలేజ్ సిబ్బందితో పాటు అబ్జర్వర్‌ను సైతం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే పరీక్షకు అరగంట ముందు పేపర్ లీక్ జరిగిందని, స్వాతి…