గత నాలుగు నెలల్లో దేశం తొమ్మిది మెగా నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లలో 2.5 రెట్లు వృద్ధిని సాధించడంతో, పబ్లిక్ ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జింగ్ చేసే మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు భారతదేశం చేసిన ప్రయత్నం ఉత్తమ ఫలితాన్ని ఇచ్చింది. ఇది సూరత్, పూణె, అహ్మదాబాద్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కతా, ముంబై మరియు చెన్నైలలో అక్టోబర్ 2021 నుండి జనవరి 2022 మధ్య 678 పబ్లిక్ EV ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. “ప్రభుత్వం ప్రైవేట్ మరియు పబ్లిక్…
ఉత్తరప్రదేశ్లో శాంతి, ప్రగతి కోసం ఓటు వేయాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆదివారం ఉత్తరప్రదేశ్ ప్రజలను కోరారు. కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పేర్కొన్నారు. “ఓటింగ్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దేశమంతటా మార్పు వస్తుంది! శాంతి, ప్రగతి కోసం ఓటు వేయండి – కొత్త ప్రభుత్వం ఏర్పడితే కొత్త భవిష్యత్తు ఏర్పడుతుంది’ అని ట్వీట్ చేశారు.ఉత్తరప్రదేశ్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు 59 నియోజకవర్గాల్లో…
ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎంతో మంది ఎంతో ఉన్నతమైన పదవుల్లో ఉన్నా.. చిన్నప్పటి స్కూల్ జ్ఞాపకాలు మరవలేనివి. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే మళ్లీ చిన్ననాటి స్కూల్ డేస్ లోకి వెళ్లాలని చాలమందే అనుకుంటారు. స్కూల్ గురించి ఎవరైనా మాట్లాడిన మనం అనుకోకుండా మన స్కూల్ జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతుంటాం. ఆనాడు చేసిన అల్లరిని గుర్తు చేసుకుంటుంటాం. పాఠశాల విద్యాభ్యాసం, 10 తరగతి పరీక్షల తరువాత అప్పటివరకు కలిసి చదువుకున్న స్నేహితులు ఇకనుంచి మనతో చదువుకోకుండా ఒక్కోరు ఒక్కో…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల హామీని నిలబెట్టుకోలేకపోయారంటూ టీఆర్ఎస్ శ్రేణులు శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలతో ఘర్షణకు దిగి రాళ్లతో దాడి చేయడంతో ధర్పల్లి మండలంలో విధుల్లో ఉన్న ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. ధర్పల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎంపీ అరవింద్ వస్తున్నారని తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. బీజేపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని టీఆర్ఎస్…
తెలంగాణ కాంగ్రెస్లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజీనామా ఎపిసోడ్కు తెరపడినట్లు కనిపిస్తుంది. తాజా ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కాసేపట్లో సోనియా గాంధీకి జగ్గారెడ్డి లేఖ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా త్వరలో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సభ్యత్వం, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తానని ఆయన వెల్లడించారు. పార్టీలో ఎవరు మాట్లాడలేని సందర్భంలో రాహుల్ గాంధీ సభ పెట్టించానని ఆయన తెలిపారు. నా భార్య నీ…
దేశ అభివృద్ధికి మంచి రోడ్లు కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా జరుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ వచ్చాక తెలంగాణలో 2 వేల 482 కిలోమీటర్ల నిర్మాణం జరిగిందని, రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ లో 2 వేల 500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండేవని ఆయన వెల్లడించారు. 99 శాతం జాతీయ రహదారులు పెరిగాయని ఆయన అన్నారు. ఒక్క పెద్దపల్లి…
మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ప్రోకి ప్రారంభ సెటప్ సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ అవసరం అని కంపెనీ ప్రకటించింది. విండోస్ 11 హోమ్ ఎడిషన్ మాదిరిగానే, విండోస్ 11 ప్రొ (Windows 11 Pro) ఎడిషన్ను మొదటి సారి వినియోగించే సమయంలో మాత్రమే ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. ప్రస్తుతం, విండోస్ 11 ప్రొ వినియోగదారులు సెటప్ సమయంలో ఇంటర్నెట్ నుండి పీసీ (PC)ని డిస్కనెక్ట్ చేయడంతో తాత్కాలికంగా లోకల్ అకౌంట్ క్రియేట్ చేసి ఎంఎస్ అకౌంట్…
సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారు జామున పోలీసుల దురుసుగా ప్రవర్తించిన ఘటన చోటు చేసుకుంది. సైఫాబాద్ నుండి ఓ కారులో మహిళలు నాంపల్లి వైపు వెళుతుండగా బస్సుకు వారు ప్రయాణిస్తున్న కారు కు మైనర్ ఆక్సిడెంట్ జరిగింది. దీంతో మహిళలు, బస్సు డ్రైవర్ ఒకరితో ఒకరు వాగ్వాదానికి దిగారు. అయితే ఇంతలోనే స్పాట్ కు చేరుకున్న సైఫాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సూరజ్ ఓ కానిస్టేబుల్ లాఠీతో మహిళలను కొట్టారు. దీంతో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న…
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో విద్యుత్ ధరలు పెంచి వాతలు పెట్టిన జగన్ సర్కార్ ఇప్పుడు కోతలు కూడా మొదలు పెట్టిందని ఆయన మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం నుంచి కరెంట్ ఉండడం లేదని, ఇంకా వేసవి రాకముందే విద్యుత్ కోతలు మొదలైపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ. 26 వేల కోట్లకు పైగా అప్పులు.. ఛార్జీలు…
ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో.. పంచాయతీ కార్యదర్శులకు పే స్కేల్ అమలు చేయడంతోపాటు వారి సర్వీస్ ను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ కార్యదర్శుల పాత్ర చాలా కీలకమైనదని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం, హరితహారం, పన్నుల సేకరణ మొదలు దోమల నివారణ దాకా పంచాయతీ కార్యదర్శుల సేవలు మరువలేనివని ఆయన అన్నారు. పంచాయతీ కార్యదర్శులపై నిత్యం అధికార పార్టీ…