ఈశాన్య చైనాలో శనివారం బస్సు పేలి ఒక వ్యక్తి మరణించగా, 42 మంది గాయపడినట్లు పబ్లిక్ సెక్యూరిటీ అధికారులు తెలిపారు. పేలుడు సంభవించినప్పుడు తమకు పెద్ద శబ్ధం వినిపించిందని, అయితే బస్సులో మంటలు చెలరేగలేదని సాక్షులు తెలిపారు. లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో జరిగిన పేలుడులో ఒకరు మరణించగా, 42 మంది తీవ్రంగా గాయపపడ్డారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో ఒక ప్రకటనలో తెలిపింది. మరో 40 మందికి స్వల్ప…
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆ నాటి నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే వీరి నిరసనలకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచాయి. అయితే నేడు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరోను నిర్వహించనున్నారు.…
హైదరాబాద్‌లోని రైల్వే క్రాసింగ్‌లపై చేపట్టే పనులకు సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నగరంలోని పలు రైల్వే క్రాసింగ్‌ల వద్ద రోడ్ అండర్ బ్రిడ్జీలు (రూబీలు), రోడ్ ఓవర్ బ్రిడ్జిల (ఆర్ఓబీలు) నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశంలో రైల్వే శాఖతో కలిసి పని చేయాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్),…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త రోడ్లు వేయాలని, నాలాలను అభివృద్ధి చేయాలని, పట్టాలు ఇవ్వాలని, ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీరు అందించాలని భావిస్తుండగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పట్టాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం రోడ్లు మూసేయడం దురదృష్టకరం. మరియు స్కైవేలు మరియు రోడ్ల విస్తరణ కోసం భూమిని కేటాయించలేదు.”అని…
ఏడు జిల్లాల పరిధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. దూరదృష్టితో కొత్త ప్రణాళికలు రూపొందించి, తదనుగుణంగా పనులు చేపట్టాలని శుక్రవారం తొలిసారిగా అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి అన్నారు. ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఏ కార్యాచరణ ప్రణాళికలను మంత్రికి వివరించారు. దేశంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి దిశగా ప్రయాణిస్తోందని ఆయన అన్నారు. తెలంగాణాకు హైదరాబాద్ మణిహారంగా…
భద్రాచలం ఎన్నికలు నిర్వహించడం లేదన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. భద్రాచలం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎస్.వీరయ్య పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆ పిటిషన్ విచారణ జరిపింది. భద్రాచలం పంచాయతా..? మున్సిపాలిటా? ప్రభుత్వం స్పష్టతనివ్వడం లేదని ఎస్ఈసీ హైకోర్టుకు తెలిపింది. పలుమార్లు లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. ఐదేళ్లుగా ఎన్నికలు నిర్వహించకపోవడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. భద్రాచలం ఎన్నికలపై 4 వారాల్లో వివరణ…
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లాలోని ఆలూరులో మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యే లు దౌర్జనానికి పాలుపడుతున్నారని ఆయన అన్నారు. కొడాలి నాని ఆధ్వర్యంలో గ్యాంబ్లింగ్ జరిగినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోరని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, రెండునరేళ్ళలో అన్ని వర్గాల్లో ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చిందని ఆయన విమర్శించారు. సీఎం జగన్ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేశారని ఆయన…
గత రెండు సంవత్సరాలుగా యావత్తు ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా కట్టడికి అగ్ర దేశమైన అమెరికా సైతం కోవిడ్ టీకాలపైనే ఆధారపడింది. అయితే ఇప్పటికే కరోనా టీకాలు ఆయా దేశాలు విస్తృతంగా చేపట్టాయి. ఫ్రాన్స్ వంటి దేశాల్లో 75శాతం కరోనా టీకాలు పంపిణీ జరిగినా కరోనా కేసులు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం భారత్ లో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. కానీ మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గత…
నేడు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏడేళ్ల నుండి కేంద్రంతో ఏమైనా పంచాయితీ పెట్టుకున్నమా, నోరు కట్టుకొని పని చేసి ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయని ప్రాధాన్యత పెరిగిందని, హైదరాబాద్‌కి వెళ్లిన వాళ్ళు గ్రామాలకు మళ్ళీ వస్తున్నారని, వ్యవసాయం ప్రాధాన్య పెరిగింది భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రెండేళ్ల నుండి నరేంద్రమోదీ పంచాయితీ మొదలు పెట్టిండని, 2 ఏళ్ల…
జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ…