బీజేపీ కార్యాలయంలో ఇవాళ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని అనేక మంది పరిపాలించారని ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక అవినీతి మరక ఉందని, కానీ పదేళ్లుగా నరేంద్రమోదీ పాలనలో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు.…
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి,అక్రమాలు టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కుంభకోణాలపై సీబీఐ విచారణ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యకార్యకర్తల సమీక్షా సమావేశంలో పాల్గొని మీడియాతో మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో వేల కోట్లకు టెండర్లు దక్కించుకొని,నాసిరకంగా పనులు చేసిన కన్స్ట్రక్షన్ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ లో జరిగిన కుంభకోణంపై దర్యాప్తు…
లోక్సభ ఎన్నికలకు తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. మెజారిటీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా 17 లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జులను నియమించింది. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్రెడ్డి సోమవారం నియమించారు. లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎ.వెంకట్ నారాయణరెడ్డి, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.…
ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను…
ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల పరిశీలన, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, నోడల్ అధికారులు పాల్గొననున్నారు. ప్రజాపాలన పై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్-సైట్ prajapalana.telangaana.gov.in ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజాపాలనలో మొత్తం1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. అయితే.. ఐదు గ్యారేటీలకు సంబంధించి 1,05,91,636 దరకాస్తులు…
తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించాలని కోరిన బోరబండకు చెందిన ఇబ్రహీం ఇంటికి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. జనవరి 2వ తేదీన నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని బోరబండకు చెందిన ఇబ్రహీంఖాన్ కేటీఆర్ కి ట్విట్టర్ వేదికగా జనవరి రెండవ తేదీన శుభాకాంక్షలు తెలియజేశారు. గత పది సంవత్సరాలుగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆధ్వర్యంలో పగలు రాత్రి అనే తేడా లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం అద్భుతమైన పని చేశారని…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం హామీల అమలు లో కాలయాపన చేస్తోందని ఆయన ఆరోపించారు. సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఆయన అన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు కోటి 25 లక్షలు దాకా వచ్చాయన్నారు. దరఖాస్తుల పేరిట ప్రజలని ఇబ్బంది పెట్టారని, చేయూత ,రైతు భరోసా పథకాలకు దరఖాస్తులు అవసరం లేదని దరఖాస్తులు తీసుకున్నారని ఆయన అన్నారు. కాలయాపన కోసమే ట్రంకు పెట్టెల్లో దరఖాస్తులు పెట్టారని,…
ఈ ఏడాది మే నెలాఖరు కల్లా సీతారామ కాలువల పనులు అన్నీ పూర్తి చేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నీటి పారుదల శాఖ అధికారులకు ఆదేశించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్షసందర్భంగా సీతారామ పనుల పురోగతి, చేపట్టాల్సిన కార్యాచరణపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి తుమ్మల పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సాగు నీరందించే ఉద్దేశంతో చేపట్టిన సీతారామ ప్రాజెక్టుపై…
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారిని మన రాష్ట్రం నుంచి పార్లమెంటు స్థానానికి పోటీ చేయాలని కోరినమని, సోనియా గాంధీ పోటీ చేసే పార్లమెంటు స్థానం నుంచి తెలంగాణపై నిజమైన ప్రేమ ఉన్న ఏ పార్టీలు పోటీ చేయవద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని, బీఆర్ఎస్ పార్టీకి కాలేశ్వరం ఏటీఎం లాగా మారిందని ప్రధానమంత్రి మోడీ హోం మంత్రి…