ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో…
హైదరాబాద్లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్,…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా…
జనవరి 31వ తేదీలోపు భారత ఆహార సంస్థకు (ఎఫ్.సి.ఐ కి) బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డిఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల సంస్థ, ఎఫ్సిఐ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కస్టమ్…
ఆదిలాబాద్ జిల్లాపై సమీక్ష చేశారని అదిలాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వెనకబడిన ప్రాంతమని, ఇంద్రవెల్లికి ఈ నెల 26 తర్వాత సీఎం వస్తా అన్నారన్నారు. నియోజకవర్గ సమస్యలపై చర్చ చేశామని, పార్టీ బలోపేతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ఓడిపోయిన వారు అధైర్యపడొద్దు అని చెప్పారని, బీఆర్ఎస్ మమ్మల్ని బదనం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. విధి విధానాలు కూడా రూపొందించక ముందే బీఆర్ఎస్ నేతలు మాటలు మట్లాడుతున్నారని, కూల్చుతం అని కడుపు మంట…
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో పాలుపంచుకునేందుకు కూల్ డ్రింక్స్ తయారీ చేసే హిందుస్థాన్ కోకో కోలా బెవెరేజెస్ (HCCB) కంపెనీ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధి బృందం సోమవారం సెక్రెటేరియట్లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డిని కలిసి సంప్రదింపులు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కోకో కోలా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో ఈ కంపెనీ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ బాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులతో పాటు సామాజిక…
తెలంగాణ ప్రజలు తెలంగాణ లో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారని, అభయ హస్తంలో భాగంగా ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం వారి అవసరాలు, బాధలు తెలుసుకో లేదన్నారు. ఎనిమిది రోజుల పాటు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతీ గ్రామానికి, వార్డుకు, అడవిలోని చెంచు గుడానికి అధికారులు వెళ్లారని, ప్రజా పాలన విజయవంతం అయ్యిందన్నారు. సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులతో లోతైన…
32 మెడికల్ కాలేజీల బదులు 32 వాట్సాప్ ఛానెల్స్ పెడితే బాగుంటుందని కేటీఆర్ అన్నారని, కేటీఆర్కు ప్రజాస్వామ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్టాన్ని అప్పుల మయం చేశారు. ప్రజలు బీఆర్ ఎస్ నేతలను బండ బూతులు తిడుతున్నారని, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. 30 రోజులు కాకముందే బుద్ధి లేనివాళ్ళు ఓ బుక్ రిలీజ్ చేశారని, కేటీఆర్ మైండ్ సెట్ చిన్నగైంది.…
పూర్తి శక్తితో పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ లో చేరికలు పై దృష్టి సారించినట్లు, ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్ నినాదం తో ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. తెలంగాణలో పోటీ బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య నే అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం అవశ్యకత తెలంగాణకు అవసరం లేదు.. బీఆర్ఎస్ ఇరెలవెంట్(అప్రస్తుతం) పార్టీ అని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో…
కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనలో ఉన్నారని, ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు..? ఆరు గ్యారెంట్ లకు నిధులు ఎక్కడినుంచి తెస్తారు..? అని ఆయన అన్నారు. 5 అంశాల పై సమాధానం చెప్పండన్నారు. కేసీఆర్ హాయoలో డ్రగ్స్ కేసు నిర్వీర్యం అయ్యింది.. కాంగ్రెస్…