32 మెడికల్ కాలేజీల బదులు 32 వాట్సాప్ ఛానెల్స్ పెడితే బాగుంటుందని కేటీఆర్ అన్నారని, కేటీఆర్‌కు ప్రజాస్వామ్యం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్టాన్ని అప్పుల మయం చేశారు. ప్రజలు బీఆర్ ఎస్ నేతలను బండ బూతులు తిడుతున్నారని, నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చారని మండిపడ్డారు. 30 రోజులు కాకముందే బుద్ధి లేనివాళ్ళు ఓ బుక్ రిలీజ్ చేశారని, కేటీఆర్ మైండ్ సెట్ చిన్నగైంది. గతంలో మంచిగా ఉండేనన్నారు పొన్నం ప్రభాకర్ రెడ్డి. సామాన్యులు సెక్రటేరియట్ కు వస్తే చూసి ఓర్వలేక పోతున్నారని, ఐదు లక్షలతో ఇండ్లు ఇస్తాం. దరఖాస్తుల స్వీకరణ నిరంతర ప్రక్రియ అన్నారు. రాష్ట్ర గౌరవాన్ని మంట కలిపారని, బ్రీతింగ్ టైమ్ ఇవ్వాలన్నారు.
ఎవరో చనిపోతే ఆటో డ్రైవర్ చనిపోతే కాంగ్రెస్ వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ ఎస్ ప్రచారం చేస్తున్నారని, ఆసత్య ప్రచారాలు చేసే మాజీ మంత్రులకు, ఇతరులకు హెచ్చరిక. కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మొరిగే కుక్కను చూసి మేం భయపడమని ఆయన వెల్లడించారు. ఉప సంఘంలో నిర్ణయం తీసుకుని విధి విధానాలు ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండ నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని త్వరలోనే మిగతావి అమలు చేస్తామని చెప్పారు.