కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారని, ఆరు గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు భయాందోళనలో ఉన్నారని, ఆరు లక్షల కోట్ల అప్పును ఏ విధంగా తీరుస్తారు..? ఆరు గ్యారెంట్ లకు నిధులు ఎక్కడినుంచి తెస్తారు..? అని ఆయన అన్నారు. 5 అంశాల పై సమాధానం చెప్పండన్నారు. కేసీఆర్ హాయoలో డ్రగ్స్ కేసు నిర్వీర్యం అయ్యింది.. కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీయాలన్నారు బండి సంజయ్. గ్లోబరిన సంస్థ వల్ల ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.. ఆ సంస్థ మీద విచారణ చేపట్టాలని, ప్రభుత్వం టీఎస్పీఎస్సీపై విచారణ ఎందుకు చేయడం లేదు..? 317 జీవోను సవరించాలన్నారు. ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
నయీం డైరీ ఏమైంది..? నయీమ్ ఆస్తులు ఎక్కడికి పోయాయి..? నయీం కేసుపై విచారణ చేపట్టాలన్నారు. కాళేశ్వరంపై విచారణ ఎందుకు చేయడం లేదు..? కాళేశ్వరాన్ని సీబీఐ కి ఇచ్చేందుకు కాంగ్రెస్ కు అభ్యంతరాలు ఎందుకు..? జ్యూడిషియల్ లో అనేక కేసులు విచారణ లేక పెండింగ్ లో ఉన్నాయి.. కాళేశ్వరం సీబీఐ కి ఇచ్చేందుకు ప్రభుత్వానికి భయమెందుకు..? అని ఆయన అన్నారు. కేంద్రంలో మరోసారి మోడీ అధికారంలోకి రాబోతున్నారు.. ఈటలకు నాకు ఎలాంటి విబేధాలు లేవు.. కలిసికట్టుగా ముందుకు వెళతాo.. ఈటల అభిప్రాయాలు కూడా అధిష్టానం గుర్తిస్తుంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మునిగిపోయే నావలు.. కేటీఆర్ కు ఇంకా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైంది.. బీఆర్ఎస్ ఒక మూర్ఖత్వపు పార్టీ.. మీది ప్రాంతీయ పార్టీనా..? జాతీయ పార్టీనా..?కేటీఆర్ చెప్పాలి.. బీఆర్ఎస్ కు ఓట్లేస్తే మూసి నదిలో వేసినట్టే.. బీఆర్ఎస్ ఎంపీలు టచ్ లో ఉన్నారు అని బండి సంజయ్ అన్నారు.