మెదక్ పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. ప్రజల నుంచి అభయ హస్తం దరఖాస్తులు మంత్రి దామోదర రాజనర్సింహ స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. వ్యవస్థ అనేది శాశ్వతం… వ్యవస్థను ఎంత ప్రతిష్ట పరిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో అన్యాయం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క గ్రామంలో ఇల్లు దిక్కులేదు..జాగా దిక్కులేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక విజన్ ఉందన్నారు. ఇచ్చిన గ్యారెంటిలను…
బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు త్వరలో ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు. తెలంగాణ భవన్లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ శస్త్రచికిత్స తర్వాత చంద్రశేఖర్‌రావు కోలుకుంటున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మనముందుకు వస్తారన్నారు. ఫిబ్రవరి నుంచి తెలంగాణ భవన్లో చంద్రశేఖర్‌రావు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రోజు వారీగా పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో మమేకమవుతారు. జిల్లాల్లోనూ పర్యటిస్తానని హరీష్ రావు…
అద్భుత అవకాశాల వేదిక అయిన విశాఖ నగరం 2030 నాటికి $100 బిలియన్ల ఆర్థికవృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని పల్సస్ సీఈవో డా.గేదెల శ్రీనుబాబు వివరించారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నగరంలోని ఇంజినీరింగ్ , MBA విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు, వైజాగ్‌ను $100 బిలియన్ల ఆర్థిక నగరంగా తీర్చి దిద్దెందుకు ఉన్న అవకాశాలను, ప్రణాళికలను వివరించారు. నగర ఆర్థిక గమ్యాన్ని రూపొందించడంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించాలని శ్రీనుబాబు పిలుపునిచ్చారు. తరగతి గదులలో,…
కామారెడ్డి నిర్వహిస్తోన్న ప్రజా పాలన కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని సమస్యలకు పరిష్కారం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ చెప్పిన విధంగా రాష్ట్రంలో దొరల పాలనను ఓడించి కాంగ్రెస్ పాలన తీసుకువచ్చామని, సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు ప్రజల వద్ద…
నిజామాబాద్- జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో ప్రజా పాలన దరఖాస్తుల పనితీరును మాజీ మంత్రి షబ్బీర్ అలీ పరిశీలించారు. దరఖాస్తు కేంద్రాల్లో అధికారులు చేపట్టిన చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజాపాలన దరఖాస్తులకు అనూహ్య స్పందన వస్తోందని, ప్రజా స్పందన చూసి ఓర్వలేక.. బీఆర్ఎస్ నేతలు 420 బుక్ లెట్ పేరుతో కాంగ్రెస్ ను బద్నాం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చిందో…
కరీంనగర్ జిల్లా సైదాపూర్‌లో కార్యకర్తల సమావేశానికి బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలను పక్క గా అమలు చేస్తాం.. వాటి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి నెల కాలేదు 420 ముద్ర వేసి ప్రచారం చేయడం సరి కాదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 379 ,384 ,393 395 సెక్టన్లు బిఆరెస్ నాయకులకు అప్లికేబుల్ అవుతాయని, స్లిప్పర్ చెప్పులతో…
420 ఎవరు..? రాష్ట్రానికి దళితుడ్ని సీఎం చేస్తా అని.. చీటింగ్ చేసింది ఎవరు అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్నించారు. మూడెకరాల ఇస్తా అని మోసం చేశావని ఆయన ప్రశ్నించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి..ఇస్తా అని చీటింగ్ చేశావని, ఆరోగ్య శ్రీ ఎత్తేశావు చీటింగ్ చేశారన్నారు. లక్ష రుణమాఫీ ఒకే సారి అన్నావు.. ఇది చీటింగ్ అని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అన్నావు ..ఇదో చీటింగ్ అని ఆయన అన్నారు. పేపర్…
కరీంనగర్ జిల్లా మానకొండుర్ మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీళ్ళు నిధులు నియామకాలు అనే గొప్ప ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి కేసీఅర్ అని ఆయన కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ప్రభుత్వం గత కేసీఅర్ ప్రభుత్వం అని ఆయన అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు రైతుబందు వేస్తానంటే ఎన్నికల కమిషన్ కు కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్ కుమార్…
అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారని, కేటీఆర్.. హరీష్ బస్సులో తిరిగరు.. వాళ్లంతా బెంజ్ కార్ల లో తిరుగుతారు కాబట్టి వాళ్లకు ఆర్టీసీ బస్సు తెలియదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు కేటీఆర్.. హరీష్ అని, నేను సభలో ఉంటే హరీష్..కేటీఆర్ ని ఆడుకునే వాణ్ణి అన్నారు. టైం బాగోలేక ఓడిపోయినని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్.. హరీష్ కి సవాల్..…