గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్ లో 12.5 GWh (గిగావాట్ ఫర్ అవర్ ) సామర్థ్యముండే బ్యాటరీ సెల్ తయారు చేయనున్నట్లు ప్రకటించింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో భాగంగా గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి ముఖ్యమంత్రి…
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. అయితే.. సమ్మక్క, సారలమ్మ జాతర సమీపిస్తుండటంతో ఇవాళ మేడారంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యటించారు. ఈ సందర్భంగా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు దర్శించుకున్నారు మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క.. అయితే.. సమ్మక్క సారలమ్మ దేవతలకు పసుపు, కుంకుమ, బెల్లం, చీరె, సారే నైవేద్యంగా పెళ్లి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి కొండా సురేఖ. అనంతరం జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు…
ధరణి కీలకమైన అంశమని, ఇది లక్షల మంది రైతుల భూమి హక్కుల సమస్య అని అన్నారు ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2023 డిసెంబర్ నాటికి ధరణి తీసుకువచ్చి ఆరు సంవత్సరాలు పూర్తి అయ్యిందని, ధరణి అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలకు, రైతులకు ధరణి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామని, కమిటీ, ప్రభుత్వం పై పెద్ద భాద్యత ఉంది. తొందర పాటు వల్ల ఏదైనా…
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 రైతులకు కానుకగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 ముగిసి కొత్త సంవత్సరం వచ్చిన ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడటం లేదని, అదే విధంగా రైతుబంధు…
వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక…
పరిస్థితి ఈడు వరకు వచ్చింది కుక్కలను నియంత్రించాలని వికారాబాద్ టీఆర్ఎస్ యువ నాయకుడు రాజేందర్ గౌడ్ తన బెంజ్ కార్ రూఫ్ లో ఎక్కి ఓ ప్లే కార్డ్ చేతిలో పట్టుకొని కారులో ఉండి పట్టణ మొత్తం తిరుగుతూ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే.. దేశంలో వీధి కుక్కల దాడులు భారీగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో…
నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC…
నిజామాబాద్ ఆంధ్రానగర్లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ కానుందని ఆయన వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్ర నగర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని, ఎన్టీఆర్ నేటికీ తరానికి ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు.…
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్…
పార్లమెంట్ ఎన్నికల పై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్ లో మూడు పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల తో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, రోహన్ చౌదరి సమావేశమయ్యారు. సికింద్రాబాద్, చేవెళ్ల, హైదారాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదారాబాద్ నియోజక వర్గాలలో పట్టు కోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదారాబాద్…