పరిస్థితి ఈడు వరకు వచ్చింది కుక్కలను నియంత్రించాలని వికారాబాద్ టీఆర్ఎస్ యువ నాయకుడు రాజేందర్ గౌడ్ తన బెంజ్ కార్ రూఫ్ లో ఎక్కి ఓ ప్లే కార్డ్ చేతిలో పట్టుకొని కారులో ఉండి పట్టణ మొత్తం తిరుగుతూ నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. అయితే.. దేశంలో వీధి కుక్కల దాడులు భారీగా పెరుగుతున్నాయి. సంవత్సరానికి దాదాపు 2 కోట్ల మంది కుక్క కాటుకు బారిన పడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ICMR) ఓ నివేదికలో తెలిపింది. కుక్క కాటుకు గురైన వారులో 17 నుంచి 20 వేల మంది వరకు రేబిస్ వైరస్ బారిన పడుతున్నారని నివేదికలో పేర్కొంది. అంటే ప్రతి రెండు సెకండ్లకు ఒక్క కుక్క కాటు, ప్రతి అరగంటకు ఒక రేబిస్ మరణం సంభవిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలు పరిశీలిస్తే మన భారత్ లోనే 36 శాతం మంది రేబిస్ వల్ల చనిపోతున్నట్లు నివేదికలో వివరించింది. మన దేశంలో దాదాపు 70 శాతం కుక్కలను ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపింది. నివేదిక ప్రకారం ఇండియాలో ప్రస్తుతం కోటి 53 లక్షల కుక్కలు ఉన్నాయి. ఈ వీధి కుక్కలు ఎక్కువగా ఆస్పత్రుల ఆవరణలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వీధి కుక్కల వల్ల అనే వ్యాధులు వస్తున్నాయని నివేదికలో తెలిపారు. కుక్కలు అనేక రోగాలకు వాహకాలు పని చేస్తున్నాయని హెచ్చరించారు. వీధి కుక్కల వల్ల రేబిస్, డిస్టెంపర్ వైరస్, రర్వో వైరస్, టాక్సో ప్లాస్మా, కెనైన్ అడినో వైరస్ లు వ్యాపిస్తాయని వివరించింది. ఆస్పత్రుల చుట్టుపక్కల కుక్కలకు సింపుల్ గా ఆహారం దొరుకుతుందని పేర్కొన్నారు.