అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు బీజేపీ గెలుస్తుందని, మోడీ నీ గెలిపించాలని పట్టుదలతో పార్టీలను కాదని మోడీ వైపు మొగ్గుచూపారని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ శాతం కూడా మాకు సానుకూలం అనే భావిస్తున్నామని, రెండు సార్లు అధికారం లో ఉన్న మోడీ పై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందన్నారు. దేశాన్ని అభివృద్ధి లో ముందుకు తీసుకువెళ్లే సత్తా ఆయనకు ఉందని ప్రజలు విశ్వసించారని, ఓట్లకోసం ఉచితాలు…
నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి పై.. కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలువ బోతుందన్నారు. లక్షా 30 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి…
దోపిడీకి సంబంధించిన ఒక వినూత్న విధానంలో, ఒక వ్యక్తి గత సంవత్సరం 200 విమానాలు ఎక్కాడు, దాదాపు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి కేవలం విమానాల్లో దోపిడీలను అమలు చేశాడు. 2023లో పలువురు ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించినట్లు సమాచారం. గత నెలలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్బ్యాగ్లోని రూ.7 లక్షల విలువైన నగలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసును ఛేదించారు.…
తెలంగాణలో నిన్న లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు ఓటువేసుందకు ముందుకు వచ్చారు. అయితే.. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని రెండు గ్రామాల్లో వంద శాతం ఓటింగ్ జరిగి ఆదర్శంగా నిలిచాయి. తెలంగాణలోని ఆ రెండు గ్రామాల ఓటర్లు ఓటుతో తమ చైతన్యాన్ని చాటారు. లోక్సభ నాలుగో దశ ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్రంలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిన్నకొల్వాయిలో…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) మే 17 వరకు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. IMD ప్రకారం, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,…
హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కె మాధవి లతకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం భారత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. పోలింగ్ బూత్ వద్ద, బురఖా ధరించిన మహిళల గుర్తింపు పత్రాలను తనిఖీ చేయడం, వారి ముసుగును ఎత్తమని కోరారని దీనపై ఎంఐఎం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన హైదరాబాద్లో అసదుద్దీన్ ఒవైసీపై మాధవిలత తలపడుతున్నారు. అమృత విద్యాలయంలో స్వయంగా ఓటు వేసిన…
మొబైల్ టిఫిన్ సెంటర్లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటన జనగాం జిల్లాలో చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రఘునాథ్ పల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో రోడ్డు పక్కనే ఓ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్న మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు మరొకరు మృతి చెందినట్లు సమాచారం. వీరేకాకుండా.. టిఫిన్ సెంటర్లో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద…
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 33.5 శాతం ఓట్లు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అంతకు మించి వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం అని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోడీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17, 2025తో మోడీ 75 ఏళ్లు నిండుతాయని,…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికలు రానేవచ్చాయి. తెలంగాణ, ఏపీతో పాటు 10 రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. తెలంగాణలో నిన్న మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తుండటంతో అక్కడక్కడ పోలింగ్ ఏర్పాట్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురియడంతో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు ఎదర్కొన్నారు. వర్షాల వల్ల నిన్న, మొన్న చిన్న చిన్న ప్రాబ్లమ్ వచ్చిందని సీఈఓ వికాస్ రాజ్…
లోక్ సభ ఎన్నికలకు నేడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. 17 లోక్ సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. యావత్తు తెలంగాణ మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే.. సిద్దిపేటలోని భరత్ నగర్ అంబిటాస్ స్కూల్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గతంలో కంటే ఎక్కువ శాతం పట్టణాలలో పోలింగ్…