సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. మోడీ ప్రభుత్వం అమలు చేస్తన్నవే మళ్లీ హామీలుగా చెప్తారా? అని, కాంగ్రెస్ మేనిఫెస్టో తెలంగాణ హామీలు అంతా డొల్ల అని ఆయన లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ హామీలు, ప్రకటనలు ఆ పార్టీని మరింత దిగజార్చేలా ఉన్నాయని, తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి. చాలా హామీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందని, మరికొన్నింటిని అమలు…
వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ప్రియాంక గాంధీ వచ్చారని, ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దబోతున్నాయని అన్నారు. వికారాబాద్ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుందని, వికారాబాద్ జిల్లా కు ముఖ్యమంత్రి పదవి,…
వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరుకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని, చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం ఇది.. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉందని ఆమె అన్నారు. ఇందిరా గాంధీ కి మీరంతా ప్రేమను పంచారని, నా తల్లి సోనియా గాంధీని మీరు సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని…
ఖమ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఎం, సీపీఐ, తెలుగుదేశం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి నీ భారీ మెజార్టీ తో గెలిపించాలన్నారు. ప్రచారం లో నిజాన్ని చెబుతూ ఎండ ను లెక్కచేయకుండా ఆదరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కావాలని, ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎలా ఓట్లు వేశారు ఇప్పుడు కూడ…
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిగులు ఆదాయంలో ఉన్న తెలంగాణ అప్పుల పాలయిందని, తెలంగాణ లో ప్రభుత్వం మారింది,కానీ ఇప్పటికీ ఉచితలు సంస్కృతి ఇంకా ఉంది,కాంగ్రెస్ అవినీతి కూడా పెద్ద ఎత్తున్న మొదలవుతుందన్నారు నిర్మలా సీతారామన్. తెలంగాణలో బీజేపీ కి మద్దతు ఇస్తారని ఆశిస్తున్నానని, రెండు రాష్ట్రాల్లో బీజేపీకి మంచి మెజారిటీ వస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఏపీలో…
ఇప్పటి వరకు మూడు దశలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే 200 సీట్లలో విజయం సాధించనున్నామని ధీమా వ్యక్తం చేశారు అమిత్షా. ఇవాళ ఆయన తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 400 సీట్ల గెలుపు దిశగా వెళ్తున్నామని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం పైన పైసా కూడా అవినీతి చేయలేదని, అలసి పోగానే బ్యాంకాక్, థాయిలాండ్ ఎవరు వెళ్తారో మీకు అందరికీ తెలుసు అని ఆయన…
మరో గంటలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ముగుస్తుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. మిగతా 106 నియోజకవర్గంలో 6 గంటల తర్వాత ప్రచారం ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని జిల్లాల్లో 144 సెక్షన్ విధిస్తారని ఆయన వెల్లడించారు. ఎలాంటి రాజకీయ పార్టీల చిహ్నాలు టీవీల్లో ప్రసారం చేయొద్దని ఆయన తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన బల్క్ sms లు నిషేధమని, జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని…
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో కేసీఆర్ మాట్లాడుతూ.. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి సిద్దిపేట కి వందనమని, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయన్నారు కేసీఆర్. బీజేపీ అజెండాలో ఏనాడు పేదల అవస్థలు ఉండవు…ఎంతసేపు అది…
ఈ లోక్ సభ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కావని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ షాద్ నగర్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా షాద్ నగర్ వాసి బూర్గుల రామకృష్ణారావు నాయకత్వం వహించారన్నారు. మళ్లీ 70 ఏళ్ల తర్వాత పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లా కు కీలకమైన మంత్రి పదవులు…
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లింక్డ్ మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కె.కవితను నిందితురాలిగా పేర్కొంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం తాజా ఛార్జిషీటును దాఖలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ను ఫెడరల్ ఏజెన్సీ మార్చి 15న అరెస్టు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) నిబంధనల ప్రకారం ప్రాసిక్యూషన్ ఫిర్యాదును దాఖలు చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఈ నెల 13న చార్జిషీట్ను…