Accident : ఖమ్మంలో రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట వద్ద ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధ దంపతులు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతానికి చెందిన మృతులు సత్యనారాయణ, రుక్మిణి దంపతులు 75 ఏళ్లు పైబడిన వారు కారులో ప్రయాణిస్తుండగా ఘటన జరిగింది. కారును నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై రాంగ్ రూట్ లో వెళుతుండగా వాహనంపై నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం తాకిడికి వాహనం దగ్ధమైంది. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వారిని రక్షించారు. వృద్ధ దంపతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరు యువకులను చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బోనకల్ ఎస్‌ఐ మధుసూధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శంకరపట్నం మండలం తాడికల్ లో డీజిల్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. తాడికల్ బస్టాండ్ వద్ద నిలబడి ఉన్న ఆరుగురుని ట్యాంకర్ అదుపు తప్పి ఢీ కొట్టింది.. దీంతో.. పూదరి శ్రీనివాస్ అనే వ్యక్తిపై ట్యాంకర్ బోల్తాపడగా ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. యాక్సిడెంట్ పై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. టాంకర్ డ్రైవర్ క్లీనర్ లను స్థానికులు గ్రామపంచాయితీలో బంధించారు. ఆస్సత్రికి తీసుకెళ్లిన వారి మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!