నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళి పై.. కాంగ్రెస్ నేతల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి , ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలువ బోతుందన్నారు. లక్షా 30 వేల మెజారిటీ తో జీవన్ రెడ్డి గెలుపు ఖాయమని, కాంగ్రెస్ కు ఓటు వేసిన ప్రజలకు ధన్య వాదాలు తెలిపారు. ఆశించిన స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వరం. అభ్యర్థి మంచి తనం మనకు ప్లస్ పాయింట్ అని వారు వ్యాఖ్యానించారు. బీఅర్ఎస్. నాయకులు బీజేపీ తో కుమ్మక్కయ్యరు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ. ప్రజలు మాకు ఓటు వేశారన్నారు.
అనంతరం పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ గెలుపు బాట లో ఉందని పోలింగ్ సరళి బట్టి తెలుస్తుందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు నా గెలుపు కోసం కృషి చేశారని, బీజేపీ మతతత్వ పార్టీ అని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం మత విద్వేషాలు రెచ్చొగొట్టి బీజేపీ నేతలు ముందుకు వెళ్లారని జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలు శాంతి యుతంగా జరిగాయని, మత సామరస్యానికి ప్రతీకగా నిజామాబాద్ నిలిచిందన్నారు. చక్కెర కర్మాగారం పున ప్రారంభానికి ప్రభుత్వం చిత్త శుద్ధి నీ ప్రజలు గుర్తించారని, సమిష్టి నాయకత్వం వల్లే విజయం వరించబోతుందని ఆయన పేర్కొన్నారు.