కేరళలో ఓ వింత జబ్బు ఆందోళన కలిగిస్తోంది. దీన్ని బ్రెయిన్ ఈటింగ్ అమీబా లేదంటే మెదడును తినే అమీబాగా పిలుస్తున్నారు. కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి ముక్కు ద్వారా మెదడులోకి వెళ్లి దాన్ని పూర్తిగా తినేస్తోంది. దీనివల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీని వ్యాప్తిని గుర్తించడం కష్టతరంగా మారింది. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుంది.. వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి.. వ్యాధి సోకితే ఏం చేయాలి.. వ్యాధి బారిన పడకుండా…
Brain-Eating Amoeba: కేరళను ‘‘మెదడును తినే అమీబా’’ కలవరపెడుతోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటస్(PAM) పిలువబడే ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే 19 మంది మరణించారు.ఈ ఇన్ఫెక్షన్ నేగ్లేరియా ఫౌలేరి అనే అమీబా వల్ల వస్తుంది. ఇది సోకిన వ్యక్తిలో మెదడును ఈ అమీబా టార్గెట్ చేస్తుంది. ఈ ఏడాది కేరళలో 61 కేసుల్లో, 19 మంది మరణించారు. వీరిలో చాలా వరకు మరణాలు కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. కేరళ తీవ్రమైన ప్రజారోగ్య సమస్యతో పోరాడుతోందని ఆ రాష్ట్ర…
Brain Eating Amoeba In Kerala: కేరళలోని తిరువనంతపురంలో మెదడును తినే అమీబా (అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్) తో బాధపడుతున్న ముగ్గురు వ్యక్తులను వైద్యులు నిర్ధారించారు. బాధితులు ముగ్గురూ చెరువులో స్నానం చేయడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకింది. కేరళ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ విషయంపై సమాచారం ఇస్తూ.. ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ముగ్గురూ తిరువనంతపురం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కేరళ ప్రభుత్వం చెరువు నీటిని వినియోగించుకునే వారికి కూడా…
Brain eating amoeba: అత్యంత ప్రాణాంతకమైన ‘‘బ్రెయిన్ ఈటింగ్ అమీబా’’ నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగి ‘‘మెనింగోఎన్సెఫాలిటిస్’’ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.
Brain-Eating Amoeba: కేరళ రాష్ట్రాన్ని అరుదైన ప్రాణాంతక ‘‘మెదడును తినే అమీబా’’ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. కలుషిత నీటిలో ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ అమీబా ముక్కు ద్వారా మానవ శరీరంలోకి చేరి చివరకు ప్రాణాలను తీస్తుంది. నేగ్లేరియా ఫౌలేరీ అనే అమీబా వల్ల ‘‘అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్’’ అనే ఇన్ఫెక్షన్ సోకుతుంది.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో గురువారం 14 ఏళ్ల బాలుడు అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కారణంగా మరణించాడు. ఇది ఒక రకమైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్, ఇది బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. బాలుడు చెరువులో స్నానం చేస్తుండగా అమీబా ముక్కు ద్వారా బాలుడి శరీరంలోకి ప్రవేశించింది. తర్వాత.. అమీబా మెదడుకు సోకింది. దీంతో బాలుడిని జూన్ 24న ఆసుపత్రిలో చేర్చారు, అయితే అతను చికిత్స పొందుతూ గురువారం మరణించాడు. బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్ కారణంగా గత…
Brain-Eating Amoeba: అత్యంత అరుదైన ‘‘నైగ్లేరియా ఫౌలేరీ’’ అమీబా వల్ల ఐదేళ్ల బాలిక మరణించింది. సాధారణంగా ‘‘మెదడును తినే అమీబా’’గా కూడా పిలిచే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కేరళ బాలిక మరణించింది.
Brain Eating Amoeba: ట్యాప్ వాటర్ లో ముక్కు కడుక్కున్నందుకు ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని సౌత్ ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. కుళాయి నీటిలో ముక్కును శుభ్రం చేసుకున్న సమయంలో నీటిలో ఉన్న అమీబా సదరు వ్యక్తి శరీరంలోకి ప్రవేశించింది. అత్యంత అరుదుగా సోకే ‘‘మెదడును తినే అమీబా’’ నెగ్లిరియా ఫౌలోరి కారణంగా అతను మరణించాడని ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. షార్లెట్ కౌంటీ నివాసి అయిన వ్యక్తి, ఫిబ్రవరి 20 న మరణించాడు.