Brain-Eating Amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో ఐదేళ్ల బాలిక మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brain-Eating Amoeba: అత్యంత అరుదైన ‘‘నైగ్లేరియా ఫౌలేరీ’’ అమీబా వల్ల ఐదేళ్ల బాలిక మరణించింది. సాధారణంగా ‘‘మెదడును తినే అమీబా’’గా కూడా పిలిచే ఈ ఇన్ఫెక్షన్ వల్ల కేరళ బాలిక మరణించింది. అరుదైన మెదడు ఇన్ఫెక్షన్ “ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్(PAM)”తో పోరాడిన బాలిక చివరకు ఓడిపోయింది. సోమవారం రాత్రి కోజికోడ్‌లో ఫద్వా పీపీ అనే బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది.
మరణించిన బాలిక ఫద్వా మే 13 నుంచి ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్‌లో చికిత్స పొందుతోంది. వారం రోజుల పాటు వెంటిలేటర్ సపోర్టుతో చికిత్స అందించారు. ఈ ఇన్ఫెక్షన్‌కి ఉపయోగించే మిల్టెఫోసిన్ అనే ఔషధం వినియోగించే సమయానికే ఆమె పరిస్థితి క్షీణించింది. మూన్నియూర్ సరస్సులో స్నానం చేసిన తర్వాత ఈ అమీబా ఇన్ఫెక్షన్ బాలికకు సోకింది. ఆమెతో పాటు సరస్సులోకి దిగిన మరో నలుగురిని వైద్యులు పరీక్షించినప్పటికీ అదృష్టవశాత్తు వీరికి ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని లేదని తేలింది.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: Lavu Sri Krishna Devarayalu: అధికారాన్ని అడ్డు పెట్టుకొని పల్నాడులో అరాచకం సృష్టించారు..
మే 1న బాధితురాలు తన బంధువులతో కలిసి ఇంటికి సమీపంలో ఉన్న సరస్సులో స్నానానికి దిగింది. మే 10న ఆమెకు జ్వరం, తలనొప్పి, వాంతులు రావడంతో స్థానికంగా ఉన్న పిల్లల వైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. బాలికను మే 12న చెలారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి చేర్పించారు. లక్షణాలు ఎక్కువ కావడంతో కోజికోడ్‌లోని మరో ఆస్పత్రికి తరలించారు. అదే రోజు ఆమె పరిస్థితి విషమించి చనిపోయింది.
ఈ అమీబా ఇన్ఫెక్షన్ ఏమిటి..?
దీనిని ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (PAM) లేదా అమీబిక్ మెనింజైటిస్ అని కూడా పిలుస్తారు, ఇది నేగ్లేరియా ఫౌలెరీ అమీబా వల్ల కలిగే అరుదైన, ప్రాణాంతక వ్యాధి. కలుషిత నీటిలో ఉండే ఈ అమీబా ముక్కు ద్వారా శరీరంలోకి చేరుతుంది. ఆ తర్వాత మెదడులో నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మెదడును క్రమక్రమంగా తినడం ప్రారంభిస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల వాసన కోల్పోవడం, తలనొప్పి, మెడ దృఢత్వం, కాంతిని చూడలేకపోవడం, వికారం, వాంతులు, దిక్కుతోచని స్థితి, మగత మరియు మూర్ఛలు వంటి లక్షణాలు అమీబా సోకిన రెండు వారాల తర్వాత కనిపిస్తాయి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!